కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో ఎందుకు మాయం అయింది!

Publish Date:May 3, 2024

Advertisement

కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన  రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మోడీకా కమల్ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.  ట్రయల్ రన్ పూర్తి కాకముందే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇచ్చి ఎంతోమంది ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చారని చ‌ర్చ దేశంలో మొద‌లైంది.  

ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మోడీ,  కోవిన్ సర్టిఫికేట్లపై తన ఫోటోను తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారందరికీ జారీ చేసే కోవిన్ సర్టిఫికేట్లపై ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను తాజాగా తొలగించారు. మనమంతా కలిసి పోరాటం చేస్తే భారత్ కోవిడ్ 19ని ఓడించగలుగుతుందని మోడీ పేరుతో సర్టిఫికేట్లు ఉండేవి. 

క‌రోనా టీకాలన్నింటినీ మరోసారి సంపూర్ణంగా పరీక్షించాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. డాక్టర్ అసీమ్ మల్హోత్రా అనే బ్రిటిష్ ఇండియన్ డాక్టర్ ఈ కొవిషీల్డ్  టీకా వల్ల గుండె పోటు, రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు వస్తున్నాయని, దీనివల్ల ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని హెచ్చరించారు. డాక్టర్ మల్హోత్రా వ్యాఖ్యలపై వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కొందరు డాక్టర్ మల్హోత్రా వాదనను సమర్ధిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

కోవిడ్ బారిన పడిన వారు పరిగెత్తడం, అధికంగా వ్యాయామం చేయడం, కఠిన శ్రమకు దూరంగా ఉండాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. ఇటీవ‌ల చిన్న వ‌య‌స్సులోనే గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో  ఐసీఎంఆర్ దీనిపై విస్తృత అధ్యయనం చేసింది. అయితే ఇంకా ఆ రిపోర్ట్ వెలుగులోకి రాలేదు.  ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి డాక్ట‌ర్ల బృంధం గుండెపై కరోనా ప్రభావం చూపినట్లు త‌మ స్ట‌డీలో తేలిందంటున్నారు. వ్యక్తి గుండెలోని విద్యుత్ వ్యవస్థ, కండరాలు, రక్తాన్ని సరఫరా చేసే ధమనులపై క‌రోనా ప్రభావితం చూపిందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. 

రక్తం గడ్డకట్టే ముప్పు ఉన్నందువల్ల చాలా యూరోపియన్ దేశాలు ఈ కొవిషీల్డ్ ను వినియోగించకూడదని నిర్ణయించిన విషయాన్ని  పుణెలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీ ప్రిన్స్ పాల్ డాక్టర్ అమితవ్ బెనర్జీ  గుర్తు చేస్తున్నారు.  కోవిషీల్డ్ లోని లోని డీఎన్ఏ మన శరీరంలోకి చేరిన తరువాత mRNA గా మారుతుంది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో మయొకార్డైటిస్  సమస్య వస్తుందని ఆయ‌న చెబుతున్నారు.
ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కే రాయ్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.

కోవిడ్ 19  వ్యాక్సినేషన్ తరువాత ఆకస్మిక మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నేప‌థ్యంలో  అన్ని టీకాలకు ఫుల్ సేఫ్టీ రివ్యూ నిర్వహించాలి’ అనే డిమాండ్ వ్య‌క్తం అవుతోంది.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.