Publish Date:Jul 25, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విశ్వాసాలతో, ఆయన పరిపాలనా విధానాలతో ఎవరైనా విభేదించవచ్చుకానీ.. భాతర రాజకీయాల్లో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ కాదన లేరు. నిజానికి.. స్వతంత్ర భారత రాజకీయాల్లో, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆరు వరస విజయాలను సొంతచేసుకున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ. వరసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యంత్రిగా విజయం సాధించిన మోదీ.. భారత ప్రధానిగా వరసగా 2014, 2019, 2024లో హ్యాట్రిక్ సాధించి డబుల్’ హ్యాట్రిక్’ సాధించిన ఏకైక నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచి పోయారు.
ఇక ఇప్పుడు మోదీ మరో రికార్డు ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంతవరకు దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానిగా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరున ఉన్న రికార్డును మోదీ సొంత చేసుకున్నారు. ఇందిరాగాంధీ.. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4 వేల 77 రోజులు ప్రధాని పదవిలో కొనసాగారు. కాగా.. 2014 మే 26 న తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ శుక్ర వారం (జూలై 25, 2025)తో 4,078 రోజులు పూర్తిచేసుకుని ఇందిరాగాంధీ రికార్డు ను అధిగమించి దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. కాగా.. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో కొనసాగారు.
అనుకోకుండా ఎమ్మెల్యే అయినా కాకుండానే.. 2001లో నేరుగా ముఖ్యమంత్రిగా గుజరాత్ శాసనసభలో కాలు పెట్టిన మోదీ 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా పార్లమెంట్ లో తొలి అడుగు పెట్టారు. మోదీ నాయకత్వంలో బీజేపీ 2014లో 272 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది. 2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ.. ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లో 30 ఏళ్లుగా సాగుతున్న సంకీర్ణ రాజకీయాలకు చుక్కపెట్టిన నేతగా.. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్సేతర ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-creats-record-as-secondm-longest-39-202705.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.