మోదీ పాలనకు పదకొండేళ్లు!

Publish Date:May 27, 2025

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన 11 ఏళ్ళు పూర్తిచేసుకుని,12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అవును.. 2014 మే 26న  నరేంద్ర మోదీ ప్రప్రథమంగా భారత ప్రధాని మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. మరో వంక మరో వారం పది రోజుల్లో.. అంటే  జూన్ 9 న మోదీ 3.0 ప్రభుత్వం  తొలి వార్షికోత్సవం జరుపుకునేందుకు సిద్దమవుతోంది.  గత ఏడాది  జూన్ 9 న నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అలాగే..  నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధనిగానూ మోదీ చరిత్ర  సృష్టించారు. 

అదలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీ  11 ఏళ్ల పాలనను అప్రకటిత అత్యవసర పాలనగా అభివర్ణించారు.  అలాగే  ఈ పదకొండేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించింది శూన్యమని తేల్చేశారు. మోదీ సర్కార్ కు ఖర్గే  జీరో మార్కులు వేశారు.  మరో  వంక బీజేపీ, ఎన్డీఎ భాగసామ్య పార్టీలు మోదీ పాలన భేష్  అని  మెచ్చుకుంటున్నాయి.  ఈ 11 ఏళ్లలో సాధించిన ఆర్థిక ప్రగతిని, ఇతర విజయాలను ఏకరవు పెడుతున్నాయి. నూటికి 200 మార్కులు ఇచ్చినా ఇవ్వవచ్చు అన్నట్లుగా  మోదీ పాలను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నాయి.  

అయితే.. రాజకీయ విమర్శలను, రాజకీయ ప్రశంసలను పక్కన పెడితే..  మోదీ  ఈ 11 ఏళ్ల పాలనలో మెరుపులూ, మరకలూ రెండూ ఉన్నాయి.  అయితే.. గతంతో పోల్చుకుంటే మోదీ పాలన భిన్నంగా సాగింది అనేది మాత్రం కాదన లేని నిజం.  నరేంద్ర మోదీ 2014 మే 26.. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు భారత దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి  ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ పాలన నిరాంటంకంగా కొనసాగుతోంది. వరసగా 2014, 2019, 2024 మూడు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కూడా మోడీ సారధ్యంలో బీజేపీ, ఎన్డీఎ  కూటమి అఖండ విజయం సాదించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలో సుస్థిర పాలన సాగుతోంది. నిజానికి మోదీ   పాలనకు  సుస్తిరత్వమే పునాది రాయి. సుస్థిర పాలనతోనే మోదీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధికి బాటలు వేసింది.  

 సుస్థిర ప్రభుత్వం పునాదుల పైనే మోదీ ప్రభుత్వం తడబాట్లు సంకెళ్ళు లేకుండా..  దీర్ఘ కాలిక ప్రయోజనాలు లక్ష్యంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. నిజమే..  మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు అన్నీ సంపూర్ణ విజయాన్ని సాధించలేదు. వ్యవసాయ చట్టాల వంటి  కొన్ని కీలక నిర్ణయాలను అనివార్యంగా వెనక్కి తీసుకోవలసి వచ్చింది. అదే సమయంలో   కోవిడ్ వంటి వైపరీత్యాలను ఎదుర్కుంటూ కూడా ఆర్థిక ప్రగతిలో లక్ష్యాలను చేరుకుంది. మోదీ తొలి ప్రమాణ స్వీకారం (2014) నాటికి 11 స్థానంలో దేశ ఉన్న ఆర్థిక వ్యవస్థ..  ఈ11 ఏళ్లలో నాలుగో  స్థానానికి చేరుకుంది. అవును.. భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.  అమెరికా, చైనా, జర్మనీ తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా  అవతరించింది. నిజానికి ఇది సామాన్య విజయం కాదు.. ప్రతి భారతీయుడూ  గర్వించదగిన విజయంగా ప్రపంచ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు.. త్వరలోనే భారత దేశం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, మన కంటే ఎక్కవగా ప్రపంచ దేశాల ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. మరో వంక, మోదీ  ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేసిన సంక్షేమ, ఆర్థిక  చేయూత పథకాలు, ఒకటొకటి వెలుగు లోకి వస్తునాయి.  నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం.. మోదీ ప్రభుత్వం అమలు చేసిన పేదరిక నిర్మూలన పథకాల ద్వారా, దేశంలో ఇంతవరకు  దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. 

అలాగే మౌలిక సదుపాయాలరంగం,సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, ముఖ్యంగా చంద్రయాన్ -3 మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.  అయుష్మాన్ భారత్ వంటి, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పథకాలతో అత్యుత్త వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఒకటని కాదు.. ప్రతి ర్రంగంలోనూ   ప్రపంచ స్థాయిని మించిన స్థాయిని చేరుకుందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ విశ్వాసంతో అడుగులు వేస్తోంది. మెరుగైన ఫ

తాలు సాధిస్తూ,  విశ్వగురు స్థానాన్ని చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. 
ఇక దేశ భద్రత విషయానికి వస్తే..  ఆపరేషన్ సిందూర్అందుకు  తిరుగులేని  ప్రత్యక్ష సాక్ష్యం. నిజానికి, 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలకోట్ వైమానిక దాడి సందర్భంగా మన సైనిక శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి.ఇక ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడికి  ప్రతిగా పాకిస్థాన్ కు బుద్ది చెప్పేందుకు  చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచం కళ్ళు తెరిపించింది.  మోదీ  నాయకత్వంలో నిర్మాణ మవుతున్న నయా భారత్, స్వశక్తి సామర్ధ్యం ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని   ఉగ్రస్థావరాలను, మట్టు పెట్టడంతో పాటుగా, పాక్ కవ్వింపు చర్యలకు జవాబుగా.. ఆ దేశంలో లోని 11 వైమానిక స్థావరాలను కూల్చివేయడం వరకూ మన సేనలు సాగించిన సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టను పెంచాయి. 

నిజమే.. మోదీ  ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించింది.  స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎన్నో దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. కానీ, మోదీ ఒక విషయంలో మాత్రం ఓడిపోతూనే ఉన్నారు. విపక్షాల నుంచి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నుంచి ఏ ఒక్క విషయంలోనూ మెప్పును అయితే పొందలేక పోయారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి, దేశ  ప్రజలు వరసగా మూడు సార్లు గెలిపించడం ద్వారా, మోదీని మెచ్చుకున్నారు. చివరకు చిదంబరం,శశి థరూర్ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం కొన్ని కొన్ని విషయాల్లో మోదీ భేష్ అంటున్నారు. కానీ, కాంగ్రస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం మోదీ పాలనలో మెచ్చుకో దగిన అంశం ఏదీ లేదని, 11 మోడీ పలాన్ టోటల్ ఫెయిల్యూర్, సంపూర్ణ వైఫల్యం అంటున్నారు.

By
en-us Political News

  
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.