నారా దేవాన్ష్ తో మోడీ తాత ముచ్చట్లు!?
Publish Date:May 11, 2026
Advertisement
దేవాన్ష్ తో మోడీ ఫోటో ప్రెజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం దేవాన్ష్ అన్న భావనే. అరే బుడ్డోడా.. ఇప్పటికే మీ తాతను చూశాన్నేను.. మీ నాన్నతో కూడా పరిచయమే. ఇక పోతే నువ్వు, రేపటి రోజున నేను లేని రోజులు పార్టీలో ఎదురు కావచ్చు. నువ్వు మాత్రం బీజేపీతో ఇలాగే కలసి నడువు. మా వాళ్లతో మంచిగా ఉండు.. అంటూ మోడీ దేవాన్ష్ తో ముచ్చట్లు పెట్టినట్లు నెట్టింట్ బోలెడు పోస్టులు దర్శనమిస్తున్నాయి. మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోలకే లెక్కలేనన్ని కామెంట్లు వస్తుంటాయి. అలాంటిది లోకేష్ తనయుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. బేసిగ్గా మోడీ ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం 16 సీట్ల సాయంతో నడుస్తున్న సంగతి తెలిసిందే . అందుకే ప్రధాని మోడీ ఇప్పటికే ఏపీకి ఎన్నో వరాలు కురిపించేశారు. తాజాగా గత ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మరీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల నివాసాలకువెళ్లి మరీ వారి కోసం విలువైన సమయాన్ని వెచ్చించారు. కాగా చంద్రబాబు నివాసానికి వెళ్లిన సమయంలో మోడీ చంద్రబాబు మనవడు, లోకేష్ కుమారుడైన దేవాన్ష్ భుజంపై చేయి వేసి మరీ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇదంతా కూడా ఒక ఎమోషన్ బిల్డప్ లో భాగంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ ఒక ప్రధాన మంత్రి మాత్రమే కాదు.. బీజేపీ ప్రస్తుత అగ్రనాయకుల్లోనే అగ్రగామి. అలాంటి నేషనల్ టవరింగ్ పర్సనాల్టీ.. ఒక బాలుడిని ఇంతగా దగ్గరకు చేర్చుకోవడం వెనక చాలానే అర్ధతాత్పర్యాలున్నాయంటున్నారు. ఇటు తెలంగాణకు సంబంధించి.. రేవంత్ ని మా పార్టీలోకి వచ్చేయవచ్చు కదా? అని చమత్కరిస్తూనే.. అటు ఏపీ పాలిటిక్స్ లో భాగంగా.. దేవాన్ష్ తో ఫోటోలకు పోజులు ఇవ్వడం వెనుక ఎంతో గూడార్థముందంటున్నారు. దక్షిణాదిలో నానాటికీ పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ ఇప్పుడు ఆ పార్టీ కేంద్ర నాయకత్వంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోడీ ఇప్పటి వరకూ ప్రధానమంత్రి పదవిలోకి వచ్చి.. మొత్తం తొమ్మిది కొత్త రాష్ట్రంల్లో అధికారంలోకి తేగలిగారు కానీ.. దక్షిణాదిలో మాత్రం బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగటి అన్న చంద్రంగానే ఉంది. పాండిచ్చేరి తప్ప.. ఇక్కడ ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పెద్ద బలంగా లేదు. ఏపీలో కేవలం కూటమితో కలసి అధికారంలో భాగం పంచుకుంటోందంతే. ఈ రాష్ట్రంలో బీజేపీది చాలా చాలా చిన్న పాత్ర అయినా సరే అది తమకెంతో విలువైనది అని చాటడానికే ప్రధాని మోడీ దేవాన్ష్ తో చనువుగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/modi-chats-with-devansh-39-219449.html





