మెజారిటీ రాకపోయినా మోడీ అజెండా మారలే..!

Publish Date:Aug 19, 2024

Advertisement

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి జనం సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. మోడీ, షా డబుల్ ఇంజిన్ సిద్ధాంతాన్ని దేశ ప్రజలు నిర్ద్వంద్వంగా నిరాకరించారు. అందుకే భాగస్వామ్యపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని నడపలేని విధంగా తీర్పు ఇచ్చారు. అయినా ప్రధాని మోడీ తీరు మారలేదు. తనను వ్యతిరేకించే శక్తులను ఇసుమంతైనా సహించేది లేదని విస్పష్టంగా చెప్పేశారు.  పంద్రాగస్టు నాడు ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన ప్రసంగంలో మోడీ సమీప భవిష్యత్ లో  తమ ప్రభుత్వం ఏం చేయబోతోందో శషబిషలకు తావు లేకుండా వెల్లడించారు. 

దేశాన్ని తాను ఏ విధంగా నడిపించబోతున్నారో చెప్పడమే కాకుండా.. తన విధానాలకు అడుగడుగునా అడ్డు తగులుతున్న శక్తులు, పార్టీలకు పరోక్షంగా హెచ్చరికలూ జారీ చేశారు. కొన్ని వర్గాలకు,మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు అభ్యంతరకరమైన వివాదాస్పదమైన అంశాలను గురించి కూడా ఆయన బహిరంగంగా ప్రకటించేశారు.  ఔను మోదీ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత తొలి సారి ఎర్రకోటబురుజులపై చేసిన ప్రసంగంలో ఆయన తన అజెండా ఏమిటన్నది విస్పష్టంగా వెల్లడించారు.   గత పదేళ్లుగా తన ప్రభుత్వం అనుసరించన విధానాలలో ఎటువంటి మార్పూ ఉండదని తేల్చేశారు. తమద సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ, ఆధిపత్యం, పెత్తనం మాత్రం బీజేపీదేనని కుండబద్దలు కొట్టేశారు.  ప్రజలు తన వ్యతిరేకతను స్పష్టంగా చాటిన ఉమ్మడి పౌరస్మృతి,  ఒకే దేశం-ఒకే ఎన్నికలు వంటి అంశాలలో వెనకడుగే లేదని చాటారు.  

అంతే కాదు తన ‘మిత్రుడు’ అదానీపై ఆరోపణలు చేయడమంటే దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమేనని అన్యాపదేశంగా సెలవిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించడం ద్వారా హిండెన్ బర్గ్  నివేదికను తప్పుపట్టారు.   పెద్ద సంఖ్యలో  యువతీ యువకులు రాజకీయాల్లోకి రావడం  ఆహ్వానించదగ్గ అంశాలే అయినా ఉమ్మడి పౌరస్మృతి వంటివి  వివాదాస్పద అంశాలనడంలో సందేహం లేదు.    మోదీ ప్రసంగించే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీని రెండవ వరుసలో కూర్చోబెట్టడం కూడా మోడీ అహంకారపూరిత వైఖరికి అద్దంపడుతోంది.  
ఇక అవినీతిపై పోరాటం అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూనే.. నిఘా సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు ఉపయోగించుకుంటున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్రం పట్టించుకోవడం లేదు. మొత్తం మీద గత పదేళ్ల పాలనకు కొనసాగింపుగానే రానున్న ఐదేళ్ల పాలన ఉంటుందని మోడీ తన ప్రసంగంలో విస్ఫష్టంగా తేల్చేశారు. 

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.