Publish Date:Aug 21, 2025
కాకరాల సత్యనారాయణ.. ఈ పేరు ఎక్కడో బాగా విన్నట్లే అనిపిస్తుంది కదా! ఈయన ఓ మంచి రచయిత. అంతే కాదు 300 పైగా సినిమాల్లో నటించారు. విప్లవ రచయితగా పేరుగాంచిన కాకరాల సత్యనారాయణ కుమార్తె ఒక పెద్ద మావోయిస్టు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సునీత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వైఎస్ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చల్లో సుధాకర్ కీలకపాత్ర పోషించారు. సుధాకర్ ను సునీత ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాకరాల సునీత భర్త సుధాకర్ ఇటీవలే పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు.
ఇక కాకరాల సునీత అయితే నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే మమేకమై ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సునీత రాచకొండ పోలీసులను బంధువుల ద్వారా కాంటాక్ట్ చేశారు. ఇప్పటివరకూ ఐదు భారీ ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న సునీత పైన 20 లక్షల పైన రివార్డు ఉంది. 40 సంవత్సరాల్లో సునీత అంచలంచ లుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ వరకు వెళ్లారు. అంతే కాదు మావోయిస్టు సిద్ధాంతాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో సునీత కీలకపాత్ర పోషించారు. మరోవైపు మావోయిస్టుల పత్రిక జంగ్, క్రాంతి లకు ఎడిటర్ గా పని చేశారు.. మావోయిస్టు భావజాలాన్ని యువతలోకి జోపించే ప్రయత్నం చేశారు.
మావోయిస్టు భావజాలానికి యువత యువత ఆకర్షితులయ్యేలా సునీత కీలక పాత్ర పోషించారు. నల్లమల ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఛత్తీస్ గఢ్, తెలంగాణలలో సునీత పనిచేశారు.. ఇటీవల జరిగిన నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ లో కూడా ఆమె పాల్గొన్నారు. మావోయిస్టుల ఎరివేతలో భాగంగా ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడవిలో అన్నలు ఉండే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సునీత జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయిం చుకుని, గురువారం (ఆగస్టు 21) రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/moaist-leader-kakarala-sunitha-surrendered-25-204736.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.