దమ్ముంటే తలసానిని ప్రతిపక్ష నేతను చేయండి.. పీసీసీ చీఫ్ మహేష్ సవాల్..!

Publish Date:Sep 14, 2026

Advertisement

బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 

ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.

దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు. 

నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు. 

అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

[ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.