శతృవులు చెల్లెళ్లు, మరదళ్ల రూపంలో ఉంటారుగా కవితక్కా!

Publish Date:Sep 2, 2025

Advertisement

కేసీఆర్ కి ‘టి ’కలసి వచ్చినంతగా ‘బి’ కలసి రాలేదా? అంటే అవుననే చెప్పాలి. ఎప్పుడైతే ఆయనకెంతో అచ్చి వచ్చే టీని విడిచిపెట్టారో అప్పటి నుంచి కష్టాలు తరుముకొస్తున్నాయి. టీలోని తెలంగాణ అనే సెంటిమెంటు ఒక తల్లిలా కాపాడుతూ వచ్చింది. అదే..  బీ ఆయన్ను పూర్తిగా విడిచి పెట్టేసింది. ఏ ముహూర్తాన ఆయన టీ తో మొదలయ్యే టీఆర్ఎస్ అన్న పార్టీ పేరును బీతో ఆరంభమయ్యే భారత రాష్ట్ర సమితిగా మార్చారో.. అక్కడి నుంచి మొదలైంది కేసీఆర్ కు కష్టాల పరంపర. మొదట ఓటమి ఎదురైంది. ఆపై వరుస కేసులు. కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్. ఇక తాను అల్లుడు కలసి కాళేశ్వరం అవినీతి ఊబిలో పీకలోతు చిక్కుకుపోగా.. తన కొడుకు ఈ ఫార్ములా కేసులో.. బిడ్డ ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కామ్.

ప్రస్తుతం హరీష్‌, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ కి మచ్చ అంటోన్న కవిత.. పార్టీకి మేలు చేస్తోందా కీడు చేస్తోందా? కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. అప్పటికీ హరీష్‌ అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేస్తూ అరివీర భయంకరుడిలా పోరాడి పేరు సాధిస్తున్నారు. ఆయనకు బూస్టింగ్ ఇవ్వాల్సిన కవిత.. అలాక్కూడా వదలడం లేదు. అనవసరమైన కామెంట్లు చేసి చెడ్డపేరు తెస్తున్నారు. 

శతృవులు ఎక్కడో ఉండరు,, చెల్లెళ్ల రూపంలో, మరదళ్ల రూపంలో ఉంటారన్న మాటను నిజం చేస్తున్నారామె. ఒక సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంటే కేటీఆర్ ఆమె చేసిందసలు తప్పే కాదు. ఇది రాజకీయ కక్ష సాధింపు. ఢిల్లీ ప్రభుత్వం పాలసీ మార్చితే అందులో తాను కూడా ఒక వ్యాపార భాగస్వామిగా ఇన్ వాల్వ్ అయ్యారని ఆమెపై పడ్డ మరకను తుడిచేసే యత్నం చేశారు. హరీష్‌ , సంతోష్ ఎలాంటి ప్రో కామెంట్ చేయకపోయినా.. నెగిటివ్ గా అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  

ఇప్పుడు కళేశ్వరం విషయంలో అలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన కవిత ఒకపక్క పార్టీపై  ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ విమర్శలతో చెడుగుడు ఆడేస్తుంటే.. ఏం చేయాలో పాలు పోవడం లేదు కేసీఆర్ కి.  అంటే టైం బాగలేకుంటే కర్రే పామై కరుస్తుందన్నట్టు.. మన అదృష్టం తిరగబడితే బిడ్డే అడ్డం తిరిగి ఇదిగో ఇలాంటి చిక్కులు తెచ్చి పడేస్తున్నారు. 

ఇప్పుడు కేసీఆర్ ని, హరీష్‌ని, సంతోష్ ని వేరు చేసి చూడాలని ఇక్కడ ఎవరికీ ఉండదు. తలసానిని ఆయన ఓఎస్డీ కలసి కాకుండా తలసానికి తెలీకుండా కేవలం ఆ ఓఎస్డీ గొర్రల స్కామ్ కి కారకుడని అంటే ఎలా ఉంటుందో.. ఇదీ అంతే. ఒక వేళ కవిత చెప్పినట్టు వీరు ఇరువురూ.. అంత అవినీతికి పాల్పడి ఉంటే.. మరి కేసీఆర్ వైఫల్యం కూడా ఇందులో ఉన్నట్టేగా? 

రాష్ట్రంలోని ప్రత్యర్ధి పార్టీల వారు, ఆపై సినీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వారి రహస్యాలను కనుగొన్న కేసీఆర్.. తన సొంతింట్లోని వారు ఇంత భారీ ఎత్తున అవినీతికిపాల్పడుతుంటే మాత్రం ఎందుకు వదిలేశారు? ఇది మిలియన్ డాలర్ క్వశ్చిన్. ప్రస్తుతం కవిత పిచ్చి ప్రయత్నమేంటంటే.. కేసీఆర్ పులుగడిగిన ముత్యం.. ఆయన్ను కాపాడ్డానికి ఇటు కేటీఆర్, అటు హరీష్‌ తో పాటు సంతోష్ ని కూడా బలిపెడుతోంది కావచ్చని అంటున్నారు. అది కూడా తన తండ్రికి చేటు తెచ్చేదేనని ఆమె ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో అర్ధం కావడం లేదంటారు పలువురు. ఇప్పుడు కాళేశ్వరం కేసు సీబీఐ వరకూ వెళ్లింది. దీంతో ఏ విధంగా ముందుకెళ్లాలో అని కేసీఆర్ ఓ పక్క తలపట్టుకుంటుంటే..  మధ్యలో కవిత తగుదునమ్మా అంటూ ఈ మేటర్ లో వేలు పెట్టి.. ఇటు సొంత కుటుంబాన్ని, అటు పార్టీని ఇరుకున పెట్టడంఎంత వరకూ సమంజసం అన్న మాట వినిపిస్తోంది.

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.