కవిత కాలికి గాయం.. ఈడీ విచారణకు బ్రేక్?

Publish Date:Apr 12, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కాలుకు ఫ్రాక్చర్  అయింది. ఆ విషయాన్ని ఆమె  స్వయంగా ట్వీట్ చేశారు. తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు కవిత ట్వీట్ చేశారు. గాయం కారణంగా కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు.  ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఫ్రాక్చర్ ఎప్పడు, ఎక్కడ, ఎలా జరిగిందనే విషయం ఆమె చెప్పలేదు. 

అదలా ఉంటే కవిత కాలుకు గాయం అయిందన్న వార్త విన్నబీఆర్ఎస్ క్యాడర్, భారత జాగృతి కార్యకర్తలు కవిత అభిమానులు, సహజంగానే సానుకూలంగా స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని తమ ఇష్ట దైవాలాను ప్రార్ధించారు. ప్రార్ధనలు చేస్తున్నారు.  కవితక్క జాగ్రత్త ... అంటూ సోషల్ మీడియా సందేశాలు పంపిస్తున్నారు. 

మరోవంక దాల్ మే కుచ్ కాలా ..హై ..అని అనుమానిస్తున్న వారు అనుమానిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికీ మూడు సార్లు ఈడీ ఎదుట విచారణకు హాజరైన కవితను మరోమారు విచారించవచ్చనే సమాచారం అందుతున్న నేపథ్యంలో కవిత కాలి గాయం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో రకరకాలు కామెంట్లు వస్తున్నాయి. అయితే, ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్‌ చంద్రశేఖర్‌   వెల్లడించిన తాజా వివరాల నేపథ్యంలో ఈడీ ఏ క్షణంలో అయినా కవితకు ఫ్రెష్ సమన్లు జారీ చేయవచ్చని అంటున్నారు.

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.