తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు గుంటనక్కగా పేర్కొంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత.
బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.
హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హరీష్‌రావును ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తారా? మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. పబ్లిక్ వాయిస్ అని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mlc-kavita-hot-comments-39-211993.html
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
ఇది కేవలం ఒక శాఖపై ఉన్న ఆసక్తి మాత్రమే కాదు.. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు గారి అద్భుత వారసత్వం. నౌపాడ - గుణుపూర్ నారోగేజ్ లైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చడం, విశాఖపట్నం నుంచి పలాస, భువనేశ్వర్ వరకు కొత్త మెమో రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికులకు అనుసంధానతను పెంచడంలో ఎర్రన్నాయుడు గారు చేసిన కృషిని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
Publish Date:May 31, 2026
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.