ఎమ్మెల్సీపై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు
Publish Date:Nov 23, 2018
Advertisement
టీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని పార్టీ సస్పెండ్ చేస్తుంది. గతంలో ఎమ్మెల్సీ రాములు నాయక్ మీద పార్టీ సస్పెన్షన్ విధించగా తాజాగా మరో ఎమ్మెల్సీపై సస్పెన్షన్ వేటు వేసింది. గత కొన్ని రోజులుగా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి.. మహాకూటమికి సంబంధించిన వ్యక్తులతో సన్నిహితంగా వుంటున్నారని భావించిన అధిష్టానం ఆయన మీద వేటు వేసింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొంది. 2014 తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన యాదవరెడ్డి. ఎమ్మెల్సీగా ఇంకొక సంవత్సరం ఎక్స్‌టెన్షన్ కూడా పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో అయన మహాకూటమికి సంబంధించిన సామ రంగారెడ్డికి మద్దతు పలుకుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆయనతో ప్రచారంలోనూ పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యక్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆయనమీద అభియోగాలు వున్నాయి. మరోవైపు యాదవరెడ్డి...చేవేళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వర్గంగా ఉన్నట్లు తెలుస్తుండగా విశ్వేశ్వరరెడ్డి గత రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈరోజు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతోపాటు యాదవరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తున్న నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం యాదవరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ సస్పెండ్ చేయటంతో యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
http://www.teluguone.com/news/content/mlc-k-yadava-reddy-suspended-from-trs-party-39-84511.html





