తిరుమలలో ఎమ్మెల్సీ దందా.. బ్రేక్ దర్శన టికెట్ల కుంభకోణం

Publish Date:Apr 22, 2023

Advertisement

 హిందువులు దేవాలయాల వైపు భక్తులు కన్నెత్తి చూడకూడదు అన్నట్లుగా అర్జిత సేవలు, ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనం టికెట్ల ధరలను జగన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా పెంచేసింది.  కొద్ది రోజుల క్రితం కాణిపాకం వరరసిద్ధి వినాయకుని దేవాలయంలో నిత్యం జరిగే, పంచామృత అభిషేకం టికెట్ ధరను ఒక్క సారిగా, రూ. 750 నుంచి రూ.5000లకు పెంచారు. అయితే  భక్తులు హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనకు దిగడంతో, అబ్బే అదేమీ లేదు అలా పెంచితే ఎలా ఉంటుందని భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే బోర్డు పెట్టామని, అధికారులు సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఆ తరువాత  విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సర్కార్ స్వాములు సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని మరింత దూరం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దసరాలో వీఐపీల కోసం అంటూ టికెట్‌ ధరను పెంచడం.. ఆ తర్వాత ఉత్సవాలు ముగిసినా అదే కొనసాగించేయడంతో సామాన్య భక్తులు అమ్మవారి దర్శనానికి దూరమవుతున్నారు. తిరుమల వెంకన్న దేవుడు మొదలు రాష్టంలోని ప్రముఖ ఆలయాలు అన్నింటినీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయ వనరులుగానే చూస్తోందని, మరో వంక భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల సహా అన్ని ప్రముఖ ఆలయాలలో అన్యమత జోక్యం పెరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ముడుపులు కట్టి స్వామి వారలకు సంర్పించుకుంటున్న కోట్లాది రూపాయల సొమ్ములను జగన్ రెడ్డి ప్రభుత్వం కొల్ల గొడుతోందని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. తాజాగా తిరుమలలో ప్రత్యేక ప్రవేశదర్శనం, బ్రేక్ దర్శనం టికెట్ల కుంభకోణంలో సాక్షాత్తూ ఒెక ఎమ్మెల్సీ ప్రమేయం బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. 

తిరుమలలో ప్రోటోకాల్‌ దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ స్కామ్‌ వ్యవహారం తీవ్ర దూమారం  రేపుతోంది. శ్రీవారి టిక్కెట్లు విక్రయం విషయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీతో పాటు మరో ఇద్దరిపై తిరుమల టూ టౌన్‌ పోలీసులు కేసు నవెూదు చేసింది. శ్రీవారి టిక్కెట్లు విక్రయం విషయంలో తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, ఆయన సహచరులను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం శుక్రవారం అదుపులోకి తీసుకుంది. అనంతరం విజిలెన్స్‌ వింగ్‌ అధికారుల ఫిర్యాదుతో ఏ1గా ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్‌, ఏ2గా డేగ రాజు, ఏ3గా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీపై  ఐపీసీ సెక్షన్‌ 420 ,468, 472, రెడ్‌ విత్‌ 34 ప్రకారం తిరుపతి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నవెూదు చేశారు. వీరిలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి నోటీసులిచ్చి వదిలేయగా.. డేగరాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్‌ కోసం గాలిస్తున్నారు. 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటగిరీ కింద ఆరుగురు భక్తులకు దర్శనం కల్పించేందుకు ఎమ్మెల్సీ  .లక్ష రూపాయలు వసూలు చేశారని, శ్రీవారి దర్శనం టిక్కెట్లను అక్రమంగా పొందేందుకు నకిలీ ఆధార్‌ కార్డులను ఉపయోగించారని టీటీడీ విజిలెన్స్‌ విభాగం పేర్కొంది. 14 మందికి ప్రోటోకాల్‌ కేటగిరీ కింద వీఐపీ బ్రేక్ దర్శనం మంజూరుకు సంబంధించి జేఈవో కార్యాలయానికి ఎమ్మెల్సీ ముందస్తు సమాచారం పంపారని తిరుమల వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఫిర్యాదు చేసింది. ఇక తిరుమల ఆలయంలో దర్శన టిక్కెట్ల బ్లాక మార్కెటింగ్‌కు ఒక ప్రజా ప్రతినిధి పాల్పడడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అంతకముందు షేక్ సబ్జీ ఇతర భక్తులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున దర్శనానికి వచ్చినప్పుడు, భక్తులు సమర్పించిన ఆధార్‌ కార్డులు నకిలీవని విజిలెన్స్‌ వింగ్‌ గుర్తించింది. దర్శన టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకునేటపప్పు సమర్పించిన భక్తుల ఆధార్‌ కార్డులలోని చిరునామా హైదరాబాద్‌ కాగా, వారు వాస్తవానికి కర్ణాటకకు చెందినవారని తేలింది. విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ వారిని నిలదీయగా, రూ.500 ధర ఉన్న వీఐపీ దర్శనం టిక్కెట్ల కోసం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి రూ.లక్ష చెల్లించినట్లు తెలిసింది. ఇలా దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ ద్వారా భక్తుల నుంచి వచ్చిన అక్రమ సొమ్ము అంతా ఎమ్మెల్సీ కారు డైవర్‌ బ్యాంకు ఖాతాల్లోకి చేరిందని విచారణలో తేలింది.

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.