భూమి లేదు.. పత్రాలు లేవు.. ఏపీ ఎమ్మెల్సీకి రూ.25 లక్షల టోకరా.!

Publish Date:Oct 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లో విలువైన స్థలాన్ని విక్రయిస్తామంటూ నమ్మించిన ఇద్దరు వ్యక్తులు.. టోకెన్ అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మాదాపూర్‌లోని 100 ఫీట్ల రోడ్డు పక్కన సుమారు ఐదెకరాల స్థలం తమదేనంటూ పేరూరు తులసీగోపాల్, అతడి కుమారుడు గిరిధర్ ఎమ్మెల్సీ రామచంద్రయ్యను నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు స్థలం న్యాయ వివాదంలో ఉందని, అందుకే తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. 

ఈ క్రమంలో టోకెన్ అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు చెల్లించాలని కోరడంతో.. ఎమ్మెల్సీ ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు.డబ్బులు తీసుకున్న తర్వాత స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని రామచంద్రయ్య కోరినట్లు తెలిసింది. అయితే, నిందితులు పత్రాలు అందించకుండా కాలయాపన చేస్తూ తప్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్సీ.. స్థలం యాజమాన్య వివరాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో సదరు స్థలంతో నిందితులకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను మోసపోయానని గుర్తించిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. 

ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ 316(2), 318(4) సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థలం అసలు యజమానులు ఎవరు? నిందితులు ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరించారు? రూ.25 లక్షల నగదు ఎక్కడికి బదిలీ అయింది? అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లో విలువైన భూముల కొనుగోలు వ్యవహారాల్లో అప్రమత్తత ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. భూమి యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, పెండింగ్‌లో ఉన్న న్యాయ వివాదాలను ముందుగానే పరిశీలించిన తర్వాతే కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం మంచిదని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

 

 

 

[  MLC C Ramachandraiah, Andhra Pradesh MLC, Hyderabad Land Fraud, Madhapur Land Scam, Rs 25 Lakh Cheating Case, Jubilee Hills Police, Real Estate Fraud, Telangana Crime News ]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.