ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు బెయిలు కావాలట.!

Publish Date:Aug 12, 2026

Advertisement

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా రాజమంత్రి ప్రత్యేక కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ పిటిషన్ లో  ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షా కాల సమావేశాలలో ప్రజా సమస్యలపై గళం వినిపించడానికి తనకు బెయిలు మంజూరు చేయాలని కోరడం ఇప్పుడు రాజకీయవర్గాలలోనే కాకుండా జన బాహుల్యంలో కూడా హాట్ టాపిక్ గా మారింది.  

శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రజా సమస్యలపై మాట్లాడటానికి, తన నియోజకవర్గ ప్రజల తరఫున గళం విప్పడానికి తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తన బెయిల్ పిటిషన్ లో అభ్యర్థించారు,  డిసెంబర్ 2021 నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనంత బాబు.. గతంలో సభలో ప్రజా సమస్యలపై ఎంతవరకు గళమెత్తారనే విషయాన్ని పక్కనబెడితే..  ప్రస్తుతం ఆయన వినిపిస్తున్న వాదన విమర్శలకు దారితీస్తోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే బెయిల్ కావాలని ఆయన అడుగుతుంటే..  ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నవైసీపీ   శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. 

ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే..  మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం  ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.  కేవలం జైలు నుంచి బయటకు రావడం కోసమే ప్రజా సమస్యల నెపంతో బెయిల్ డ్రామాలు ఆడుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా అనంతబాబు మండలిలో గళమెత్తిన సందర్భాలు దాదాపు మృగ్యమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి సభలో ప్రజా సమస్యలపై ఏం మాట్లాడుతారని నిలదీస్తున్నారు. మొత్తం మీద అనంతబాబు బెయిలు పిటిషన్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఆయన బెయిలు దరఖాస్తుపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. 

MLC Anantha Babu Bail Petition, YCP Assembly Boycott, Rajahmundry Central Jail, Raise Public Issues, Sasanamandali, Dead Body, Door Delivary

By
en-us Political News

  
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
ఓటర్ల జాబితా పునఃపరిశీలన సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన పేర్కొన్న చిరునామాకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సందర్భంగా సదరు అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గడచిన నాలుగు సంవత్సరాలుగా నివసించడం తేలింది. నివాసం ఉండని వ్యక్తి పేరును ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. అధికారులు ఆయన పేరును చిరునామా మారిన ఓటర్ల కేటగిరీ కింద వర్గీకరించారు.
అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ ఆశా వర్కర్ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఘర్షణలకు, ప్రెస్ మీట్ల విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా మారిన ముఖ్యమైన అంశాల్లో మెగా డీఎస్సీ ఒకటి..
సూర్యగ్రహణం వేళ కరెంట్ వాడకం తగ్గించిన వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆక్టోపస్ ఎనర్జీ ఆఫర్ ప్రకటించింది. సోలార్ పవర్ కొరత, గ్రిడ్ భద్రత మరియు నిపుణుల విశ్లేషణల పూర్తి వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.