Publish Date:Jun 21, 2025
బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నది. మనోజ్‌రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సుబేదారి పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్ రెడ్డి నాలుగు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఆయనకు చుక్కెదురయింది. శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-padi-kaushik-reddy-25-200390.html
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు.
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేసి 81 లక్షల రూపాయల విలువైన 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.
అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు.
విశాఖలో కోకైన్ కలకలం రేపింది ఓ ఆఫ్రికన్ వద్ద 25 గ్రాముల కొకై న్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో అసత్యపు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది.
రాయచోటి ఘటన జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని,దీనిపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఓక ప్రకటనలో హెచ్చరించారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ పలు పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు అత్కూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్, పటమట పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం చేసి వెళ్లారు
సింహాచలం అప్పన్న ఆలయంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో కూటమి సర్కార్ మరో మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలని నిర్ణయంచింది.
యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు.