Publish Date:Jun 21, 2025
బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నది. మనోజ్‌రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సుబేదారి పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్ రెడ్డి నాలుగు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఆయనకు చుక్కెదురయింది. శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-padi-kaushik-reddy-39-200389.html
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పునిచ్చారు
గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా భూ సమస్యలు పరిష్కారస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది.
ప్యాంటు జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్, అత్తాపూర్‌లో జరిగింది. ఈ ఘటనలో యువకుడి తొడకు గాయాలయ్యాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పాలన కేంద్రం ఆత్మకూరులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు.
హైదరాబాద్ లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్నిఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్వస్థతకు గురై సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో గురువారం (జులై3 ) చేరిన సంగతి తెలిసిందే. ఆయన కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే స్థానికుడి ప్రాణం పోయింది. ఆ వివాదం ముదిరింది. దానిపై రాజకీయ రచ్చ తీవ్రస్థాయికి చేరింది. ఇష్యూ చల్లారిపోయిందనుకున్న ప్రతిసారీ.. మళ్లీ రాజుకుంటోంది.
లక్ష క్రాస్ అయినట్టు కనిపించిన బంగారం ధరలు అనూహ్యంగా యాభై నుంచి డెబ్బై వేలకు పడిపోనున్నాయా? అన్నది డిబేట్ గా మారిందిప్పుడు. కొన్ని సంస్థలు కూడా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టే ఛాన్సుందని చెబుతున్నాయి.
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నాయి. కానీ పైరసీకి మాత్రం ఒక్కటంటే ఒక్క ఉపాయం కూడా కనుగొనలేక పోవడం విచారకరం. పైరసీని అరికట్టడం ఎలా ఉన్నదే ప్రస్తుతం టాలీవుడ్ జనాలను వేధిస్తోన్న ప్రశ్న.
జపాన్ మాంగా కళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జపాన్ కి భారీ సునామీ రానుందని చెప్పడంతో.. ఎందరో తమ జపాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్కసారిగా జపాన్ టూరిజం పడకేసింది.