అమరావతిలో బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి బాలయ్య శంకుస్థాపన
Publish Date:Aug 13, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావలితో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి హందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం (ఆగస్టు 13) శంకుస్థాపన చేశారు. ఆ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తదితరులు హాజరయ్యారు. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం సీఆర్డీయే 21 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఆస్పత్రిని రెండు దశలలో నిర్మించనున్నారు. తొలి దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించి మలి దశలో వెయ్యిపడకలకు విస్తరించనున్నారు. వాస్తవానికి 2014-19 మధ్య కాలంలోనే అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అప్పట్లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆస్పత్రి నిర్మాణం ముందుకు సాగలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఆస్పత్రి నిర్మాణం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. బసవరామతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ హైదరాబాద్ లో సేవలందిస్తున్నది. క్యాన్సర్ చికిత్సలో విశ్వసనీయతకు పేరుగాంచింది. ఇప్పుడు అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సిద్ధమైంది. అమరావతి క్యాపిటల్ రీజియన్ లోని తుళ్లూరులో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ అభివృద్ధి చేయనుంది. క్యాన్సర్ చికిత్సను ఇతర ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా అవసరమైన చోట ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ సంకల్పించింది. అమరావతిలో 21 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న బసవరామ తారకం క్యాన్సర్ హాస్లిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సమగ్రమైన క్యాన్సర్ చికిత్స, పరిశోధనతో పాటూ క్యాన్సర్ పేషెంట్ కేంద్రీకృత సంరక్షణ కోసం ఒక ఎక్స్ లెన్సి సెంటర్ గా తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతోంది. 750 కోట్ల రూపాయల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు, క్లినికల్ ఎక్స లెన్స్‌పై దృష్టి పెట్టింది. అలాగే , అధునాతన రేడియేషన్, ఆపరేషన్, టెక్నాలజీతో ఖచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్సా వ్యవస్థల ఏర్పాటు చేయనుంది. క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, పునరావాసం ఇలా ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్ ను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇక అమరావతిలో ఏర్పాటు కానున్న బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో 2028 నాటికి ఆపరేషన్లు ప్రారంభమౌతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/mla-balakrishna-lay-foundation-stoe-to-basavaramatarakam-cancer-hospital-39-204115.html





