కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది. జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాహుల్ అనే విద్యార్థి మృతదేహం ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బావిలో లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ మృతదేహం రాహుల్‌దేనని తుది నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.
జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాజేశ్వర్ కుమారుడు రాహుల్ సైదాబాద్‌లోని లక్ష్మికళ బాయ్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. అంకం రాహుల్ కనిపించడం లేదని అతని తండ్రి అంకం రాజేశ్వర్ కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా రాహుల్ చివరిసారిగా గత నెల మే 27న కాచిగూడ టూరిస్ట్ జంక్షన్ ప్రాంతంలో కనిపించినట్లు పోలీసులు గుర్తించారు.
స్నేహితుడి మోటార్ సైకిల్‌పై అక్కడికి చేరుకున్న రాహుల్, అనంతరం తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపో యాడు. అయితే ఆతర్వాత అతను హాస్టల్ లేదా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న కాచిగూడ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ లొకేషన్, సాంకేతిక ఆధారాలు, స్నేహితులు మరియు బంధువుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తూ విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే నిన్న ఆదివారం పోలీసులకు ఓ సమాచారం అందింది... దీంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 30న ఓ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. సింగరాయకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతదేహం వద్ద లభించిన వస్తువులు, దుస్తులు మరియు ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం అవి అదృశ్య మైన విద్యార్థి రాహుల్‌కు సంబంధించినవిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కాచిగూడ పోలీసులు, రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. అయితే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కేవలం భౌతిక గుర్తుల ఆధారంగా నిర్ధారించడం సాధ్యం కాకపోవడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. డీఎన్ఏ నివేదిక వచ్చిన తర్వాతే మృతదేహం రాహుల్దేననే విషయంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ఈ పరిణామంతో రాహుల్ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, డీఎన్ఏ పరీక్షల ఫలితాల అనంతరం తదుపరి చర్యలు చేపడతామని కాచిగూడ పోలీసులు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/missing-btech-student-case-36-222260.html
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.