హర్మూజ్ జలసంధి వద్ద ఎల్ పీజీ ట్యాంకర్ పై క్షిపణి దాడి.. భారత నావికుల భద్రతపై ఆందోళన.!

Publish Date:Jul 24, 2026

Advertisement

హర్మూజ్ జలసంధి వద్ద ఎల్ పీజీ ట్యాంకర్ పై క్షిపణి దాడి.. భారత నావికుల భద్రతపై ఆందోళన.!
  హర్మూజ్ జలసంధి వద్ద ఒక ఎల్పీజీ ట్యాంకర్ పై జరిగిన క్షపణి దాడిలో ఆ నౌకలో ఉన్న ఇండియన్ నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.  మొజాంబిక్ దేశ పతాకంతో సముద్రంలో పయనిస్తున్న  దిశ   ఎల్‌పీజీ  ట్యాంకర్ లో 28 మంది ఇండియన్  నావికులు విధులు నిర్వర్తిస్తున్నారు. విశ్వస నీయంగా అందిన సమాచారం మేరకు ఈ క్షిపణి దాడి నుంచి నౌకలోని 28 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.  ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం   ధ్రువీకరించింది. దాడి సమాచారం అందిన తక్షణమే.. ఇండియన్ ఎంబసీ.. ఇరాన్ అధికార యంత్రాంగంతో   సంప్రదింపులు జరుపుతూ, నౌకలో  వారి భద్రతను ఎప్పటికప్పుడు తెలుసు కుంటున్నది. 

 విదేశీ  వార్తా సంస్థలు విడుదల చేసిన ఆడియో రికార్డింగ్‌ల ప్రకారం..  క్షిపణి దాడి జరగడానికి కొద్దిసేపటి ముందే   అమెరికా మిలిటరీ ఆపరేటర్ సదరు నౌకకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ జలాల వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, నేరుగా నౌక ఇంజిన్ రూమ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని హెచ్చరించారు.  ఆ  హెచ్చరికల అనంతరం  నౌకపై   క్షిపణులతో   దాడి జరిగింది. దాడి అనంతరం  అత్యవసర సహాయం కావాలి  ఆ నౌక నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. కాగా భారత ప్రభుత్వం ఇటీవలే.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ  హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే   నౌకల్లోనూ భారతీయ సీఫేరర్లను, నావిక సిబ్బందిని  నియమించవద్దని  అన్ని అంతర్జాతీయ నౌకాయాన సంస్థలకు  ఆదేశాలు జారీ చేసింది.  

Strait of Hormuz tension, LPG Tanker Disha attack, Indian sailors in Iran

By
en-us Political News

  
తెలంగాణాలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిపిన పురావస్తు పరిశోధనల్లో వెలికి వచ్చిన అరుదైన సమాచారాన్ని శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారని వేణు నక్షత్రం తన ప్రసగంలో చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో లేని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలన్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది. గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏడేళ్లుగా తనకు ఇస్తున్న హామీలను నిర్వాహకులు నెరవేర్చడంలేదన్నారు. చెప్పిన సమయానికి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. తన ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ.. మాట తప్పడం సరికాదన్నారు.
భారత వాతావరణ శాఖ శాస్త్రీయ అధ్యయనాల అనంతరం ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని చెబుతుంటే.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భవిష్యవాణి రంగం మాత్రం కుండపోత వర్షాలు, భారీ వరదల ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.
మొత్తంగా మోడీ పర్యటనలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
భోగాపురం నుంచి నేరుగా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఉత్తరాంధ్ర ప్రగతికి గేట్‌వేగా అభివర్ణించారు. ఇప్పుడు ఇక తదుపరి టార్గెట్ గా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపడమే కావాలని ఆంధ్రులు కోరుతున్నారు.
నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది
బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలాంటిర్ టెక్నాలజీస్ మరియు అర్మాడా సంయుక్తంగా షిప్పింగ్ కంటైనర్లలో ఎన్విడియా B300 AI యాక్సిలరేటర్లతో పనిచేసే మొబైల్ వార్ డేటా సెంటర్లను ఆవిష్కరించాయి. ఇంటర్నెట్ మరియు క్లౌడ్ కనెక్షన్ లేకపోయినా యుద్ధ రంగంలోనే స్వతంత్రంగా పనిచేసే ఈ వినూత్న టెక్నాలజీ విశేషాలు చూడండి.
సోనీ సంస్థ తన 10 ఏళ్ల మైలురాయిగా విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన 1000X కలెక్షన్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌పై మొదటిసారి 15 శాతం పరిమిత కాలపు డిస్కౌంట్‌ను ప్రకటించింది. DSEE ఆల్టిమేట్ టెక్నాలజీ, 12 మైక్రోఫోన్ల నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ప్రీమియం ఆడియో డివైజ్ పూర్తి వివరాలు మరియు ఆఫర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్ ఐపిఓ ప్రైస్ బ్యాండ్ రూ. 200 212 గా నిర్ణయించబడింది. ఆగస్టు 7 నుండి 11 వరకు సబ్‌స్క్రిప్షన్ కి అందుబాటులో ఉండే ఈ ఐపిఓ పూర్తి వివరాలు, లాట్ సైజ్ మరియు లిస్టింగ్ తేదీలను ఇక్కడ తెలుసుకోండి.
8వ వేతన సంఘం 8th Pay Commission వార్షిక ఇంక్రిమెంట్ ప్రతిపాదనలపై కీలక వివరాలు. 3%, 5%, మరియు 6% ఇంక్రిమెంట్‌ల ఆధారంగా లెవెల్ 1, 2, 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 5 ఏళ్లలో ఎలా పెరుగుతుందో సమగ్రంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.