సీతక్క ప్రజల్లో పట్టు కోల్పోతుందా?
Publish Date:Jun 28, 2025

Advertisement
ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజల గొంతుకై ప్రశ్నించింది, తనను నమ్ముకున్న ప్రజల సంతోషాల్లో కష్టాల్లో భాగస్వామ్యం అయింది, ప్రజల పట్ల తనకున్న అభిమానం విలక్షణమైన తన సేవ గుణం దేశంలోనే ఒక గొప్ప నాయకురాలుగా పేరు సంపాదించుకుంది. కానీ అధికార పార్టీ మంత్రిగా ఉన్న తనకి తన పార్టీ నాయకుల వ్యవహార శైలితో రోజురోజుకీ ప్రజల్లో పట్టుకోల్పోతుందా అనిపిస్తుంది ఇంతకీ ఎవరు ఆ నాయకురాలు ఏంటా కథా..
సీతక్క ఓ నమ్మకం, కష్టాలో ఆమె ఓ సహాయం, ఆపదలో ఉన్న వారికి ఆమె భరోసా, ప్రజా నాయకురాలిగా అలుపెరుగని పోరాటం, ప్రజాసేవలో అలసిపోని మానవత్వం కలిగిన అరుదైన వ్యక్తిత్వం సితక్క, ఆలాంటి నాయకురాలు కోటికొక్కరుంటారు..కానీ అధికార పార్టీ మంత్రిగా ఉన్న తనకి ఒకప్పుడు జేజేలు పలికినవారు నేడు ఆమెకి దూరం అవుతున్నారు. ఒకప్పుడు ఎంత బిజీగా ఉన్నా, ప్రజల కష్టాలలో ఓదార్చి వారి తరుపున మాట్లాడి వ్యక్తి, నేడు రాష్ట్ర మంత్రిగా, మరో జిల్లా ఇంచార్జ్ మంత్రిగా బిజీ గా ఉండటంతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఎందుకు సీతక్క లాంటి నాయకురాలు ప్రజల నుండి దూరం అవుతున్నారు, ప్రజలు సీతక్క గురించి ఏమను కుంటున్నారో తన దృష్టికి వెళ్తుందా లేదా ములుగు జిల్లా నాయకులు మంత్రి సీతక్క ను మై మరిపిస్తున్నారా..?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ములుగు లోని ప్రజలు ఎంతో సంతోషించారు ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో కలలు కన్నారు.. కానీ వారు కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి..సితక్క లాంటి డైనమిక్ లీడర్ తన నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పార్టీ నాయకుల ఆగడాలు తనకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అయోమయంలో నియోజకవర్గ ప్రజలు.
గల్లీ లీడర్ నుంచి జిల్లా లీడర్ వరకు సెటిల్మెంట్ల దందా, ఇసుక దందా లో అధికార పార్టీ నాయకుల చేతివాటం పై అనేక ఆరోపణలు, అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నాయకుల అక్రమ దందాకు అసలైన లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు ఎవరైనా నిలదీస్తే వారిని టార్గెట్ చేసి కేసులు పెడుతూ దాడులు చేస్తామని బెదిరిస్తున్న అధికార పార్టీ నాయకులు. దీంతో ఒకప్పుడు జేజేలు కొట్టిన వారే ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు.ములుగునియోజకవర్గ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి తో సీతక్క గెలుపు కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన ఎందరో అభిమానుల మనసులో వున్న అభిమానం తొలగిపోతుంది.
ఒక మండలంలోని గ్రామ అధ్యక్షుడు ఇందిరమ్మ ఇళ్లలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మంత్రి సీతక్క మండల నాయకుల నుండి జిల్లా నాయకులు వరకు చేస్తున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదు సరికదా వారి ఆగడాలకు అడ్డు కట్ట వేయక పోవటంతో రెచ్చిపోతూ వి డోంట్ కేర్ ఎనీ వన్ అన్ని విర్ర విగుతున్నారు. అధికారమనేది ఎవరికి శాశ్వతం కాదు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు చేసే అభివృద్ధి పనులు స్థిర స్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోవాలి. ఆ విధంగా ప్రజల మన్ననలు పొందాలి.
అధికారం ఉందనే పొగరుతో పోలీసుల సహాయంతో కోర్టు గొడవలు,భూ పంచాయతీలు, బలవంతపు సెటిల్మెంట్, అవినీతి అక్రమాలు, పేకాట దందాలు, ఇసుక దందా, కాంట్రాక్టర్ల దందా లకు కేరాఫ్ అడ్రస్ గా ములుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహార శైలి ఉంది అని ప్రజలు గుసగుస లాడుతున్నారు. ఓ సీనియర్ నాయకుడు జిల్లాలో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పలుమార్లు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రాణం పోయినా పేకాట ఆపను అని బహిరంగనే చెప్తున్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఎలాంటి హోదా లేకపోయినా హడావుడి చేస్తున్న ఎందుకు సీతక్క అతనిపై చర్యలు తీసుకోవటం లేదు. నైతిక విలువలకు మారుపేరుగా ఉన్న సీతక్క అధికార మత్తులో విలువలు విశ్వసనీయతను పక్కకు పెట్టేసిందా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు..
సీతక్క అంటే ఒక అంకితభావం,క్రమశిక్షణ, పట్టుదల కలిగిన గొప్ప నాయకురాలు తన జీవితం లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, తన 20 సంవత్సరాల పైగా రాజకీయ జీవితంలో ప్రజా సేవ లలో తనకంటూ ప్రజల్లో గొప్ప అభిమానం సంపాదించుకున్న నాయకురాలు సీతక్క..ఇప్పటికైనా సీతక్క తన వ్యక్తిత్వానికి మచ్చ తీసుకువస్తున్న వారిని కంట్రోల్ చేయాల్సిన అవసర ఎంతైనా ఉంది. అధికార పార్టీ నాయకులను అధికార అహంకారం నుంచి ప్రజాసేవ వైపు మళ్లించాలి ప్రజలు కోరుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పేకాట,సెటిల్మెంట్లు, అక్రమ దందాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకొనీ అధికార పార్టీ మంత్రిగా తనని నమ్ముకున్న ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ప్రజలు ఆశిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/minister-seethakka-39-200855.html












