Publish Date:May 18, 2022
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజాది ఆమెకే సాధ్యమైన ప్రత్యేక స్టైల్. పంచ్ డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుపడినా, రాజకీయాలలో క్రియాశీలంగా ఉంటూ జబర్దస్త్ వంటి కామెడీ షోలలో హల్ చల్ చేసినా ఆమెకే చెల్లింది. వీటిపై వస్తున్న విమర్శలను ఆమె పెద్దగా పట్టించుకోరు. సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చినా ఆమె తన స్టైల్ మార్చుకోలేదు. రాజకీయాలైనా, సినిమా అయినా గ్లామర్ ప్రాముఖ్యత ఆమెకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు.
తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి జగన్ ఆమెను కేబినెట్ లోకి తీసుకుని కీలకమైన పర్యాటక శాఖను కట్టబెట్టారు. రాష్ట్రంలో టూరిజం డెవలప్ మెంట్ కోసం ఏం చేయాలని ఆమె భావిస్తున్నారో ఇంకా తెలియదు కానీ, మంత్రి హోదాలో ఆమె తిరుపతిలో ఓ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కు హాజరై సందడి చేశారు.
తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేసిన లండన్ బ్యటోరియం బ్రాంచ్ ను ఆమె ప్రారంభించారు. అంతేనా బ్యూటీ పార్లర్ అంతా కలియదిరిగి సందడి చేశారు. ఆ బ్యూటీ పార్లర్ లో ఒక కస్టమర్ గా తానూ నెయిల్ కటింగ్ చేయించుకున్నారు. బ్యూటీ టిప్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంత వరకూ చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన అత్యాధునిక బ్యుటీషియన్ సేవలు తిరుపతిలోనూ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
మొత్తానికి తిరుపతిలో తన చేతుల మీదుగా ప్రారంభమైన బ్యూటీ పార్లరే మంత్రి హోదాలో ఆమె పాల్గొన్న తొలి కార్యక్రమంగా చెబుతున్నారు. ఈ బ్యూటీ పార్లర్ తిరుపతిలో ఓ టూరిస్ట్ స్పాట్ గా వెలుగొందుతుందని చెప్పకనే చెబుతున్నారు. కాగా బ్యూటీ పార్లర్ ఆమె సందడిని చూసిన వారు మాత్రం సినిమాలను వదిలేసినా గ్లామర్ ప్రాముఖ్యతను రోజా బాగా గుర్తు పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-roja-halchal-in-beauty-parlour-25-136049.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.