రో(త)జాకీయం!

Publish Date:Oct 5, 2023

Advertisement

రాజకీయాన్ని రాజకీయంగా.. రాజకీయంలా చూడాలి. అలా అయితే రాజకీయం.. రాజకీయం అవుతుంది. అంతేకానీ.. ఇంట్లో గుట్టుగా తమ కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటూ.. వాళ్లు బాగుంటే మనం బాగుంటామనుకొనే ఆడవాళ్లను సైతం బయటకు లాగేసి.. వాళ్లు ఇలాంటి వాళ్లు.. వీళ్లు అలాంటి వాళ్లంటూ.. ఇంటికే పరిమితమైన ఆడవారి మానసిక స్థైర్యంపై దెబ్బ కొట్టి మరీ దగుల్బాజీ రాజకీయం చేస్తూ.. ఓ విధమైన సైకో ఆనందం పొందడం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పాలక పక్షానికి అలవాటుగా మారి పోయింది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి   రోజాపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఆయన్ని అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల కావడం.. అలాగే ఈ అంశంపై మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణపై విమర్శలు గుప్పిస్తూ.. రోదించారు.  ఈ నేపథ్యంలో గతంలో  రోజా.. బుల్లెతెరపై పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ  సందర్భంగా  రోజా ఓ చర్చా కార్యక్రమంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌తో మాట్లాడిన అభ్యంతరక వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నావ్? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అంటూ చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పోడియం చుట్టూ  ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా చేరుకున్న సమయంలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా ఆర్కే రోజు వ్యవహరించిన తీరు.. దీంతో నాటి అసెంబ్లీ స్పీకర్ కొడెల శివ ప్రసాదరావు.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడం.. అందుకు సంబంధించిన వీడియోలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ సాక్షిగా రోజా తెలుగుదేశం మహిళా నాయకురాళ్లు వంగలపూడి అనిత, పీతల సుజాతలపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. 

ఏమమ్మా రోజా.. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీ పార్టీలోని మంత్రులు ఎంత మంది ఎన్ని బండ బూతులు మాట్లాడినా.. మీ పార్టీలోని పెద్దలు కానీ.. అగ్రనేతలు కానీ.. పోనీ పార్టీ అధ్యక్షుడు కానీ.. ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు.. అని ఎన్నడైనా అన్నారా? రాజకీయాన్ని రాజకీయంలాగా చూడండి.. రాజకీయంగా ఎదుర్కొండి అంతేకానీ.. ఇంట్లోని మహిళలపై వ్యక్తిగత విమర్శలకు దిగ వద్దంటూ.. ఎవరైనా.. ఎప్పుడైనా చెప్పారా? అలా చెప్పి ఉంటే... ఈ రోజు నీవు ఇలా ప్రెస్‌మీట్ పెట్టి.. కన్నీళ్లు పెట్టుకోవలసిన పరిస్థితి ఉండేది కాదని  నెటిజన్లు పేర్కొంటున్నారు. 

ఓ నెటిజన్ అయితే.. అడు చెప్పాడా?... వీడు చెప్పాడా? నీ అమ్మ మోగుడు చెప్పాడా? అంటూ ఓ మంత్రిగారు.. ఏకంగా మీడియా ముందే తొడ కొట్టి మీసం మెలేసి,.. అరిచి పెడబొబ్బలు పెట్టి మరో మంత్రి, ఇక మరో ఆమాత్యుడైతే అయితే.. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి ఆర్చుకు తీర్చుకొని ఛలోక్తులు విసురుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం గుర్తులేవా అని నిలదీశాడు.  జగన్ మలి కేబినెట్‌లో చోటు దక్కించుకొన్న నోరున్న మంత్రుల్లో ఒకరు అదీ అసెంబ్లీలోనో.. బహిరంగ సభలో తెలియక.. మైకు కనబడగానే మైకాసురుడిలాగా మారిపోయి.. మాస్ హిస్టిరియాతో ఊగిపోవడం.. అలాగే ఇంకో మంత్రివర్యుడు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందంటే.. ఆ ఒక్కటి అడక్కు అంటూనే.. సంక్రాంతి పండగకు జనంలో కలిసి స్టెప్పులేస్తూ.. ఊగిపోవడమే కాకుండా.. ఆనంద తాండవం అంటే ఇలా ఉంటుందంటూ.. తాను నడిరోడ్డుపై వేసిన చిందులకు కొత్త పేరు పెట్టి మరీ ప్రాచుర్యం పొందడం.. ఇలా జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రుల గురించి చెప్పుకొంటూ పోతే.. ఓ పెద్ద పురాణమే అవుతుందని.. అందులో ఏ మాత్రం సందేహలే లేదని పేర్కొంటున్నారు. 

ఇక   రోజా.. తనపై టీడీపీ నేత విమర్శలకు కన్నీటి పర్యంతం కావడంతో ఇంకో నెటిజన్ అయితే తనదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత   రోజా.. అసెంబ్లీకి ఎన్ని సార్లు హాజరయ్యారో ఏమో కానీ.. అలాగే ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఎన్ని సార్లు  పర్యటించారో తెలియదు కానీ... మంత్రిగా తిరుమలలో శ్రీవారిని మాత్రం  రికార్డు స్థాయిలో దర్శించుకొన్నారని..  కామెంట్ చేశాడు. 

మరో నెటిజన్ అయితే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ నుంచి ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసిన తర్వాత.. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైనే కాకుండా ఆయన ఫ్యామిలీపైన చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను.. ఓ మహిళగా  రోజా ఆ రోజే ఖండించి ఉంటే.. నేడు  ఇలా మీడియా ముందు కన్నీటి రోజాయణం వినించే పరిస్థితి వచ్చి ఉండేది కాదని పేర్కొన్నాడు. 

అయినా... ఇంట్లో చిన్న పిల్లవాడు తప్పు మాట్లాడితే.. మూతి మీద ఒకటి కొట్టి.. ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు అని పెద్దవారు చెబితే... ఆ పిల్లవాడు మరోసారి అలా మాట్లాడడానికి జంకుతారని.. ఈ విషయం రోజాకూ తెలుసునని.. కానీ వైసీపీలో రోజా సహా పలువురు ప్రజా ప్రతినిధులు.. బూతుల పంచాంగమే మన పదవి యోగానికి ఆదృష్ట మంత్రమని అనుకొని పఠించారో ఏమో కానీ.. మీడియా ముందు అయినా.. వేదిక మీద అయినా.. ప్రజల ఎదుట అయినా.. మాస్ హిస్టిరియాతో ఊగిపోతూ మాట్లాడడం..  మినహా   మరో పని చేయడంలేదని నెటిజన్లు అంటున్నారు.

ఇప్పటి వరకూ దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో  వైసీపీ ప్రజా ప్రతినిధులు  మా బూతులే మా భవిష్యత్తుఅన్నట్లుగా కదం తొక్కుతున్నారని విమర్శిస్తున్నారు.  

జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాని నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా.. అలాగే జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు  రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఎక్సెట్రా ఎక్సెట్రా లు, అలాగే  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, చివరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం లాంటి ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలు వింటుంటే.. జగన్ ప్రభుత్వం ఇంతగా అపకీర్తిని,అప్రతిష్టను మూట కట్టుకుందంటే.. ఆ పాపం ఎవరిదని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆ పాపంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ది సింహభాగమనీ, ఆ తరువాత పార్టీలోని మంత్రుల నుంచీ కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ ఆ పాపంలో భాగముందని చెబుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ నామ స్మరణతో చెక్క భజన చేస్తుంటే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రం చేతులు అడ్డం పెట్టుకొని, భుజాలు ఎగరేసుకొంటూ మరి ముసి ముసి నవ్వులు చిందించడం చూస్తుంటే ఈ విషయం ప్రస్ఫుటంగా అర్థమవుతోందని నెటిజన్లు సోదాహరణగా పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.