Publish Date:Feb 24, 2025
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే పుష్కరాల ఏర్పాట్లలో ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా పకడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నది. ఇందు కోసం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తోంది.
ఈ పరిశీలన కోసం మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక బృందం అక్కడ పర్యటిస్తోంది. ఈ బృందం మంగళవారం (ఫిబ్రవరి 25) రెండో రోజు కుంభమేళా ఏర్పాట్ల పరిశీలనలో ఉంది. తొలి రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 24) మంత్రి నారాయణ బృందానికి కుంభమేళా కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీస్, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లు, భద్రత తదితర అంశాల విషయంలో చేసిన ఏర్పాట్లు, తీసుకున్న జాగ్రత్తలపై యూపీ అధికారులు ఏపీ మంత్రి నారాయణ బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇక మంగళవారం నారాయణ బృందం కుంభమేళాలో వివిధ సెక్టార్లలో ఏర్పాట్లను పరిశీలించనుంది.
ఇక మధ్యాహ్నం కుంభమేళాి అథారిటీ కార్యాలయంలో అధికారులతో భేటీ అవ్వనుంది. మొత్తం మీద కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా తీసుకోవలసిన చర్యలపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నది. ప్రయాగ్ రాజ్ వెళ్లిన బృందంలో మంత్రి నారాయణ వెంట మునిసిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమహేంద్ర వరం మునిసిపల్ కమీషనర్ కేతన్ గార్గ్ తదితరులు ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-narayana-team-tour-prayagraj-39-193383.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?