విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. క్షతగాత్రులను పరామర్శించి, భరోసానిచ్చిన మంత్రి నారా లోకేష్

Publish Date:Jun 9, 2026

Advertisement

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం (జూన్ 9)ఉదయం నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు.  మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు.  ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 విభాగంలో సోమవారం జూన్ 8) సాయంత్రం సంభవించిన  ఘోర పేలుడులో తొమ్మండుగురు మరణంచగా, ఆరుగురు తీవ్రంగా గాయపడిన  సంగతి తెలిసిందే.

 బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి నారా లోకేష్, వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇతర నగరాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

ఈ పారిశ్రామిక విపత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాయి. సేల్ ( పరిధిలోని బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక సాంకేతిక కమిటీని రంగంలోకి దించారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు, నిర్వహణ లోపాలపై ఈ కమిటీ సమగ్ర విచారణ జరపనుంది.

ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు పాతిక లక్షల  రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే.. మృతుల కుటుంబాలలో  ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు.  ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల తక్షణ సాయాన్ని ప్రకటించారు. పరిశ్రమలలో ఇలాంటి పునరావృతం కాకుండా విశాఖ పరిసర ప్రాంతాల్లోని భారీ పరిశ్రమలన్నింటికీ సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

By
en-us Political News

  
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జూలై 18 నాటి న్యూయార్క్ టైమ్స్ కనెక్షన్స్ పజిల్ గేమ్ 1133 హింట్స్ మరియు ఖచ్చితమైన సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. మీ విన్నింగ్ స్ట్రీక్‌ను సులభంగా కాపాడుకోండి.
అమెరికాలో ఏఐ కంపెనీల సంపద పంపిణీపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. కంపెనీల స్టాక్‌లో 50 శాతం వాటాను పబ్లిక్ వెల్త్ ఫండ్‌కు బదిలీ చేయాలనే ప్రతిపాదనకు 69% మంది ప్రజలు మద్దతు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సబ్‌స్క్రైబర్లలో భారీ మార్పు! మొదటి సీజన్ తర్వాత 70 శాతానికి పైగా వ్యూయర్స్ షోలను ఎందుకు వదిలేస్తున్నారో బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
భారతదేశంలో యూపీఐ UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ MDR ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.2,000 దాటిన లావాదేవీలపై గరిష్టంగా 0.5 శాతం కంటే తక్కువ ఛార్జీ విధించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మరియు దీనివల్ల ఎవరిపై ప్రభావం పడుతుందో ఇక్కడ చదవండి.
ఆసుపత్రిలో చేరినప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సులభంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా సెటిల్ అవ్వడానికి అడ్మిషన్ నుండి డిశ్చార్జ్ వరకు పాటించాల్సిన 10 అద్భుతమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా, టీసీఎస్ అద్భుత ఫలితాలు మరియు బ్యాంకింగ్ షేర్ల భారీ కొనుగోళ్ల వల్ల శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీల పూర్తి అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
గత 20 ఏళ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని 22 రెట్లు పెంచి, అదిరిపోయే రాబడులను అందించిన 7 అద్భుతమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్, మిడ్, ఫ్లెక్సీ క్యాప్) వివరాలు మీకోసం.
ఫిఫా వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌ల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బార్లు, క్లబ్బుల వేళలను అర్ధరాత్రి దాటి తెల్లవారుజామున 4:30 గంటల వరకు పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.