షిరిడీ సాయి సేవలో మంత్రి నారా లోకేశ్ దంపతులు
Publish Date:Jan 12, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా సోమవారం (జనవరి 12) ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. సూర్యోదయానికి ముందు సాయిబాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే విశిష్ట కాకడ హారతి కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికి, బాబా వారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. దర్శనం అనంతరం లోకేశ్ దంపతులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా క్రతువు ముగిసిన తర్వాత అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటూ మంత్రి ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh-in-shiridi-sai-temple-36-212398.html





