Publish Date:Jul 20, 2025
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు లోకేశ్ తెలిపారు. జైల్లో నాన్నను చూసి గుండె తరుక్కుపోయిందని ఆయన తెలిపారు. జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ రెండు చోట్లు చంద్రబాబు అని పేరు చూశాను. ఆ కారాగారాన్ని అభివృద్ధి చేసింది. ఆయన ఉన్న భవనాన్ని కట్టించింది నాన్నే. అలాంటి వ్యక్తిని అక్కడ చూసి చాలా బాధవేసిందని లోకేశ్ తెలిపారు.
ఇంట్లో, ఆఫీస్‌లో తన తండ్రి చంద్రబాబును ఎలా పిలుస్తారనే విషయంపై స్పందించారు. "కింద ఫ్లోర్లో ఉంటే ఆయన నా బాస్. పై ఫ్లోర్లో ఉంటే ఆయన నా నాన్న. రాజకీయాలు ఇంట్లోకి రావు, ఆఫీస్‌లోకి పర్సనల్ మేటర్స్ రావు. అవి మేము గీసుకున్న కచ్చితమైన హద్దులు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను నాన్నా అని పిలుస్తాను. తన కెరీర్ లో తల్లి నారా భువనేశ్వరి పాత్రను కూడా ప్రస్తావించారు. "మా అమ్మ నా పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది.
నా ఎదుగుదల కోసం అన్ని రకాలుగా త్యాగం చేసింది. నా చదువు, కెరీర్ మరియు ఇతర అంశాల్లో నాకు మార్గదర్శనం చేసింది" అని వివరించారు. ఇక తమ కుటుంబ వ్యాపారంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ చెప్పారు. అప్పటినుంచి ఫుల్ టైమ్ రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh-39-202350.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.