కడప నగరం పసుపుమయం

Publish Date:May 27, 2025

Advertisement

 

కడప నగర శివారుల్లోని పబ్బాపురం లే ఔట్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహానాడుకు భారీ సంఖ్యలో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పూర్తిగా మహానాడు పసుపుమయం అయ్యింది. కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతాలు పలికారు.  మహానాడు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మంగళవారం నిర్వహించిన ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సభకు ప్రతినిధులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. కడప నగరంలో దాదాపుగా 36 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు వుంది. ఈ రింగ్ రోడ్డు గుండా రాయచోటి, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలకు రాక పోకలు సాగతుంటాయి. ఈ రింగ్ రోడ్డులో ఎక్కడ చూసిన వాహనాలు బారులు తీరాయి. ప్రజలతో కిట కిటలాడాయి.  ప్రాంగాణానికి చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి పోవడంతో పోలీసులు కష్టపడి ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ వచ్చారు. ఎలాంటి  ప్రమాదాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు.

*వర్షం రాక పోవడంతో ఊపిరి

 రుతు పవనాల ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా  గత రెండు రోజులుగా అడపదడపా వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంలో కూడ వర్షాలు కురవడంతో మహానాడు ప్రాంగాణం బురదమయం అయ్యింది. మహానాడు నిర్వహకులు బురదమయం అయిన ప్రాంతాల్లో గ్రావెల్ పరచడంతో రాక పోకలు సాగించారు. ఈనెల 26 నుంచి 29 వరకు వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.  అయితే మంగళవారం ఉదయం నుండి ఎటువంటి వర్షాలు కురవక పోగా వాతావరణం చల్లగా మారింది. దీంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవిలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుంటామని, తీవ్ర ఉక్కపోతలకు గురయ్యే వారమన్నారు. అయితే సారి చల్లటి వాతావరణంలో మహానాడు నిర్వహించు కోవడం ఆనందంగా వుందన్నారు.

 *భోజనాలు

 తెలుగుదేశంపార్టీ ఆహ్వానం మేరకు నలుమూలల నుంచి పార్టీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. వారికి ఆంధ్ర, రాయసీమ, తెలంగాణలకు చెందిన 30 రకాల  ప్రత్యేక వంటకాలను తయారు చేసి వడ్డించారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహరం కూడ వడ్డించారు. మొదటి రోజు దాదాపుగా 30 వేల మందికి వడ్డించారు.  ఉదయం అల్పాహారం, మధ్యాహ్నాం భోజనం,  సాయత్రం స్నాక్స్ అందించారు.  1,700 మంది వంటవారు, మరో 88 మందిని వడ్డింపునకు వినియోగించారు. ఇక స్వీట్స్ లో  తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా   తదితర స్వీట్స్ పెట్టారు.  భోజనాల వద్ద ఇబ్బందులకు గురయ్యారు.

 *అంగరంగ వైభవంగా 

మాహానాడు  అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.  పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫోటో ప్రదర్శనను తిలకించారు.  ఎన్టీఆర్ విగ్రహానికి  నివాళి అర్పించారు. ముఖ్యనాయకులను ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించారు. వేదిక పై మా తెలుగుతల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ  నాయకులకు, కార్యకర్తలకు, నేతలకు, మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో 1,033 మంది చనిపోయినట్లు పార్టీ  నాయకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.  అలాగే  పహల్గం ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారు.

 *మహానాడు తీర్మాణాలు ఆమోదం

మొదటి రోజు మంగళవారం ప్రతినిధుల నమోదుతో సమావేశం ప్రారంభమైంది. తొలి ఏడాదిలో ప్రభుత్వ ఘన విజయాలు,  శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రజా రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణకు అడుగుల పై పలువురు పార్టీ నాయకులు తీర్మాణాలు ప్రవేశపెట్టడంతో నాయకులు ఆమోదం వ్యక్తం చేశారు.  అలాగే శాంతిభద్రతల  పరిరక్షణకు పటిష్ట చర్యలు పై చర్చ,  చంద్ర విజన్ తో సంక్షేమ కార్యక్రమం తీర్మాణం పై చర్చించి ఆమోదించారు.

By
en-us Political News

  
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.