మంగళగిరిలో శ్రీ సీతారామస్వామి కోవెలను సందర్శించిన మంత్రి లోకేష్

Publish Date:Mar 25, 2026

Advertisement

 బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని  పాత మంగళగిరిలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి కోవెలను మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.   ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు,  తెలుగుదేశం స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం మంత్రి లోకేష్ సీతారామస్వామి వార్లను దర్శించుకుని ఆశీర్వాచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్ తదితరులు పాల్గొన్నారు. 

By
en-us Political News

  
ఇక 2014 నుంచి పవన్ తో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవ‌ర‌ని చేస్తే.. నాదెళ్లమనోహర్, లింగమనేని రమేష్, తాళ్లూరిరామ్.. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. చివరి ఇద్దరూ కూడా ప‌వ‌న్ కి, ఆయ‌న పార్టీ జ‌న‌సేన‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డిన వాళ్లే. పార్టీ ఆఫీస్ కూడా వీరిలో ఒక‌రిచ్చిన స్థలంలో కట్టిందే.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు
రూఫ్ టాప్ సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వివిధ బ్యాంకులు వినియోగదారులకు లోన్ మంజూరు చేస్తున్నాయి. అంతేకాకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండడంతో వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గుతోంది. గృహంపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 1.5 లక్షలు వ్యయం అవుతుండగా, అందులో రూ. 60,000లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ
భువనేశ్వర్‌లో విమానం ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అనంతరం అక్కడ కొంతసేపు నిలిపిన విమానాన్ని అర్ధరాత్రి తిరిగి శంషాబాద్‌కు తీసుకువ చ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురయ్యారు.
లుత ఎన్ఆర్ఐ టిడిపి నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు సమాజానికి ఎన్టీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు, తెలుగు సంస్కృతికి ఆయన తెచ్చిన గుర్తింపును ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టిడిపి సభ్యులు కొనియాడారు.
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారనీ, ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నారన్నారు.
కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు రాబట్టి తృటిలో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును మిస్ చేసుకున్నాడు. అయితేనేం.. ఈ ఇన్నింగ్స్‌లో 334.48 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో సన్‌రైజర్స్ బౌలింగ్ లైనప్‌ను తుత్తునియలు చేసేశాడు. ఆస్ట్రేలియా పేస్ స్టార్ పాట్ కమిన్స్ వేసిన ఓవర్లలో సైతం హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి పవర్‌ప్లేలోనే రాజస్థాన్ జట్టు స్కోరును 80 పరుగులకు చేర్చాడు.
ఇరాన్ గనుక ఈ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ జలసంధిని ప్రపంచ దేశాలన్నింటికీ అందుబాటులో ఉంచేలా అమెరికా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఏ దేశం కూడా హర్మూజ్ జలసంధిని తమ గుత్తాధిపత్యంగా మార్చుకోలేదన్నారు.
1947లోనే బిఎ పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన 1100 మందిలో ఉద్యోగానికి అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. అలా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన దృష్టి ఉద్యోగం మీద ఉంటేగా.. సినిమాల్లో నటునిగా రాణించాలనే తపన ఆయనను నిలువనీయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాస్ వెళ్లిపోయారు.
1982 మార్చి నెలాఖ‌రులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రి తొలి వారంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ మ‌హానాయ‌కుడిగా రాణించిన అరుదైన వ్య‌క్తి ఎన్టీఆర్‌.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలమేరకు.. ఈ ధరల రాయితీ లేదా కుషన్ కేవలం సామాన్య రిటైల్ వినియోగదారుల కోసమే ఉద్దేశించబడింది. నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 97 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కేవలం మూడు పరుగుల తేడాతో తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
ప్రతి ఏటా మే 28న వచ్చే ఈ పవిత్రమైన రోజున నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవాన్ని స్మరించుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను రంగురంగుల పువ్వులతో, పచ్చటి ఆకులతో సుందరంగా అలంకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.