Publish Date:Jun 16, 2026
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై మంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా సమావేశంలో చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తిచేస్తామని చెప్పారు.
కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా తలెత్తుతున్న సమస్యలను ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. జోనల్ ఇంఛార్జ్, నియోజకవర్గ పరిశీలకులను పంపి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-lokesh-meets-with-punganur-tdp-leaders-36-223165.html
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.
సొంత సర్వేతోనే జగన్‌కు షాక్?.. ‘మావిగన్’ వ్యూహంపై పార్టీలో అసంతృప్తి..?
తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం, హత్య ఉదంతం కేసులో దర్యాప్తు సంస్థలకు అత్యంత కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి.
అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌కు అండగా నిలిచే ఇస్లామిక్ మిత్రదేశమే ఈ విధంగా పాక్ బయాయిలను ముక్కుపిండి మరీ వసూలు చేయడానికి సిద్ధం కావడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. అప్పులు తీసుకోవడం, వాటిని సకాలంలో తీర్చకుండా కాలయాపన చేయడం పాకిస్థాన్ కు మామూలే. అయితే ఈ సారి మాతరం యూఏఈ కాలయాపనను ఇసుమంతైనా సహించేది లేదని అల్టిమేటం ఇవ్వడంతో పాకిస్థాన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.