మంగళగిరిలో అండర్ డ్రైజేజీ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
Publish Date:Jun 17, 2026
Advertisement
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 11 వందల 67 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు పునాది రాయి పడింది. ఈ పనులకు మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బుధవారం (జూన్ 17) శంకుస్థాపన చేశారు. తాడేపల్లి ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో రెండు దశలుగా చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 11 వందల 67.50 కోట్ల రూపాయలు కాగా, మొదటి దశ పనులకు.604.32 కోట్లు, రెండూ దశ పనులకు 563.18 కోట్ల రూపాయలు కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా జనం మురుగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల ప్రాచారంలో మంగళగిరిలో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పనులను ప్రారంభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/minister-lokesh-lays-foundation-stone-for-underground-drainage-works-36-223242.html





