వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండి : మంత్రి లోకేష్

Publish Date:Jun 26, 2026

Advertisement

 

రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్జీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. శుక్రవారం స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ క‌మాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్టీజీఎస్‌పై మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ ల‌క్ష్యాలు, ప్రాజెక్టుల ప్ర‌గ‌తిపై ఆ శాఖ కార్య‌ద‌ర్శి కాటంనేని భాస్క‌ర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివ‌రించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ ప‌నుల‌న్నీ జులై నాటికి పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. 

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్ తో అనుసంధానించాలి. పాఠశాలల్లో  డ్రాప్ అవుట్ల‌ను డేటా లేక్ ద్వారా విశ్లేషించి, త‌గ్గించ‌డానికి గ‌ల‌ మార్గాలను అన్వేషించాలి. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నాం. అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని మంత్రి సూచించారు. 

మనమిత్ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావాలి

ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై మరింతగా అవగాహన కలిగేలా నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వ‌హించాల‌న్నారు. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌జ‌ల‌కు క‌లిగే ఉప‌యోగం, వినియోగం, సుల‌భంగా ప్ర‌భుత్వ సేవ‌లు ఎలా పొంద‌వచ్చో ప్ర‌జ‌లకు వివరించాలన్నారు. 

స‌ర్టిఫికెట్ల వెర్ఫికేష‌న్‌కు ఆధార్‌

విద్యార్థులు, అభ్య‌ర్థులకు విద్యా-క్రీడా సంస్థ‌లు ఇచ్చే స‌ర్టిఫికెట్లు, స్పోర్ట్స్ స‌ర్టిఫికెట్ల‌న్నీ అభ్య‌ర్థి ఆధార్ నెంబర్ ఆధారంగా పార‌ద‌ర్శ‌కంగా ప‌రిశీలించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. అభ్య‌ర్థి ఆధార్ నంబ‌ర్ కొడితే ఆ విద్యార్థి లేదా అభ్య‌ర్థికి ఆ సర్టిఫికెట్లు ఏ సంస్థ‌, ఎప్పుడు, ఎవరు జారీ చేశార‌నే వివ‌రాలు కూడా రియ‌ల్ టైమ్‌లో తెలిసేలా డీజీ వెరిఫైని ప‌క‌డ్బందీగా తీర్చిదిద్దాల‌ని ఆదేశించారు. దీనివ‌ల్ల 99 శాతం అధికారుల ప‌ని కూడా సుల‌భ‌త‌రం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో  ఇచ్చే వేలాది పోస్టుల నోటిఫికేష‌న్ల‌కు, ల‌క్షల సంఖ్య‌లో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకుంటార‌ని, వీరంద‌రి స‌ర్టిఫికెట్లు పొందుప‌ర‌చ‌డంలో ఇబ్బందులు లేకుండా డీజీ వెరిఫైని స‌మర్థ‌వంతంగా వినియోగించుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలని ఆదేశించారు.

వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌ను స‌మర్థంగా ఎదుర్కొందాం

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావంపైనా మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఎల్‌నినో ప్ర‌భావంతో ఎదుర‌య్యే వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌ను జ‌ల‌వ‌నరుల శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ‌, ఇత‌ర శాఖ‌ల‌న్నీ కూడా స‌మ‌న్వ‌యంతో, ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప‌నిచేసి స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొందామ‌న్నారు. నీరు వృథాను అరిక‌ట్టి, త‌క్కువ నీటితో ఎక్కువ పంట‌లు  పండించే దిశ‌గా రైతులను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. జ‌లాశ‌యాల్లో నీటి ల‌భ్య‌త ఎంత ఉంది, భూగ‌ర్భజ‌ల మ‌ట్టాలు ఏ స్థాయిలో ఉన్నాయ‌నేది ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం ద్వారా రియ‌ల్ టైమ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని ఆ దిశ‌గా అధికారులు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాలి. రాయ‌లసీమ‌లో నీటి ఎద్ద‌డి లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. యూరియా సరఫరాపైనా మంత్రి ఆరా తీశారు. 

 విద్యుత్ డిమాండ్ పైనా దృష్టి కేంద్రీకరించాలి 

వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి త‌గ్గడంతో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు అధిగ‌మించేందుకు ప్రణాళికాబ‌ద్ధంగా ప‌నిచేయాల‌ని మంత్రి సూచించారు. జ‌లాశ‌యాల్లో నీటి మ‌ట్టాలు, పెరుగుతున్న విద్యుత్తు వినియోగం, భూగ‌ర్భ జ‌లాలు వీటన్నిటినీ క్రోడీక‌రించి ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం విశ్లేషించి అధికారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందజేయాలి. విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు ఎక్క‌డా ఎలాంటి అంతరాయం లేకుండా ప‌టిష్ట‌ చ‌ర్య‌లు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో సీసీఎల్ఏ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌య‌ల‌క్ష్మి, ఆర్టీజీఎస్ సీఈవో ప్ర‌ఖ‌ర్ జైన్‌,  సంయుక్త కార్య‌ద‌ర్శి మాలిక గార్గ్‌, ఆర్టీఐహెచ్ సీఈవో ధాత్రి రెడ్డి, ఫైబ‌ర్‌నెట్ ఎండీ గీతాంజ‌లి శ‌ర్మ‌, సివిల్ స‌ప్లైస్ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు, ఉన్న‌త విద్యాశాఖ క‌మిష‌న‌ర్ నారాయణ భ‌ర‌త్ గుప్త‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ త‌మీమ్ అన్సారియా, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ మన్జీర్ జిలానీ పాల్గొన్నారు.

By
en-us Political News

  
CSM టెక్నాలజీస్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నేటితో క్లోజ్ కానుంది. అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా రిటైల్ ఇన్వెస్టర్లు పాటించాల్సిన ముఖ్యమైన టిప్స్, అలాట్‌మెంట్ మరియు లిస్టింగ్ తేదీల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అఫ్గానిస్థాన్ పరిధిలోని పక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై కచ్చితమైన వైమానిక దాడులు జరిపింది. ఈ వైమానిక దాడుల్లో మరో 25 మంది ఉగ్రవాదులు మరణించారనీ, వారి ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని మంత్రి అతావుల్లా తారార్ వివరించారు.
ఈ అల్పపీడన ద్రోణులకు తోడు రుతుపవనాల కదలిక కూడా చురుకుగా ఉండటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హచ్చరించింది. ఏపీలో ఒక ద్రోణి ఉత్తర కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. రెండో ద్రోణి కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కన్యాకుమారి వరకు కొనసాగుతోంది.
ముందుకు వెళ్ళి యూ-టర్న్ తీసుకోవడానికి బదులుగా, అదే హైవేపై కారును వెనక్కి రివర్స్ చేయడం అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక స్కార్పియో ఎస్‌యూవీ వాహనం, ఈ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
తన పిలుపు మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేశారు. అలాగే ఇంధన పొదుపు కూడా పాటించారు.
గంటలు శిధిలాల కింద చిక్కుకుపోయిన తండ్రీ కొడుకులు ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతంగా జనం భావిస్తున్నారు. సాధారణంగా భూకంపం సంభవించిన మొదటి 72 గంటలను గోల్డెన్ అవర్స్‌గా భావిస్తారు. ఈ 72 గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న మనుషులు ప్రాణాలతో బతికే అవకాశాలు దాదాపు శూన్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తుంటారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టులో హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీతో రాణించగా, బెంజమిన్ 37 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీశారు.
హైదరాబాద్‌లో వేల కోట్ల భూకబ్జా యత్నం.. ఎంపీ కేశినేని చిన్నిపై కేసుకు నాని ఆరోపణలు..
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది.
ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి, కానీ నేటి సమాజంలో కొందరు వ్యక్తులు దానిని ఒక మూర్ఖపు పంతంగా మార్చుకుంటున్నారు.
పూజలు, వ్యాపారాల పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు భారీ టోకరా...
ఏపీలో స్మార్ట్ కిచెన్లపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు..జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.