బ్యూరోక్రాట్లకు రాజకీయ నేతలంటే చులకన.. కేటీఆర్ కామెంట్లపై రచ్చ..

Publish Date:Aug 18, 2021

Advertisement

తెలంగాణ మున్సిపల్ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన కొన్ని వ్యాఖ్యలు రచ్చగా మారుతున్నాయి. అధికారులను ఉద్దేశించిన ఆయన సరదాగానో మరో కావాలని కాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాటలపై అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు కోపంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగులతో సర్కార్ గ్యాప్ మరింత పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. 

కేటీఆర్ చేసిన కామెంట్ల విషయానికి వస్తే.. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమానికి ఐటీ మంత్రి హాజరయ్యారు.  ఈ సందర్భంగా యాజమాన్యం తరపునే కాదు.. లెక్చరర్లు.. విద్యార్థులు ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే  ప్రభుత్వ పథకాల అమల్లో ఎదుర్కొనే అవరోధాలు ఏమైనా ఉన్నాయా? అని ఒక విద్యార్థిని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించింది. దీనికి జవాబిచ్చిన కేటీఆర్.. అధికారుల్లో అయితే తాము చాలా చదువుకున్నామని.. పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుందని అన్నారు. ఏదైనా కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పగానే.. అది సాధ్యం కాదు అనే మాట ఐఏఎస్ అధికారుల నుంచి వస్తుందని తెలిపారు. మార్పు కోరటం అంత సలువైంది కాదన్న కేటీఆర్.. బ్యూరోక్రాట్లు రాజకీయ నేతల్ని గెస్టు ఆర్టిస్టులుగా భావిస్తారని కామెంట్ చేశారు. ప్రజా ప్రతినిధులు ఐదేళ్ల కాలానికి వచ్చిపోతారనే భావనే దీనికి కారణమన్నారు. అధికారులు పర్మనెంట్ ఆర్టిస్టులుగా భావిస్తుంటారని కేటీఆర్ తెప్పారు. 

తాను ఐఏఎస్ అధికారి కావాలని తన తండ్రి కేసీఆర్ కోరికగా ఉండేదన్నారు. ఢిల్లీలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో మేనమామ ఒకరు ఇచ్చిన సలహాతో ఆ ప్రయత్నాన్ని వదిలేశానని చెప్పారు. ఐటీ ఉద్యోగం చేశానని.. ఉద్యోగంలో భాగంగా చాలా దేశాలు తిరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉన్నత అధికారులపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు రచ్చగా మారుతున్నాయి.ప్రభుత్వ అధికారులపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. ఇలా వ్యాఖ్యానించటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకవైపు అధికారుల్ని తమకు తగినట్లుగా వాడేస్తూనే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న ఆవేదనను కొందరు వ్యక్తం చేస్తున్నారు

ఈ సమావేశంలోనే మంత్రి కేటీఆర్ కు ఎప్పుడు ఎదురుకాని ఒక ప్రశ్న ఎదురైంది. గీతం కళాశాల అధినేత భరత్ కేటీఆర్ ను ఆయన అనూహ్యమైన ప్రశ్నను సంధించారు. మీ రాజకీయ జీవితంలో ఫెయిల్ అయిన ఘటనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జీవితంలో ఫెయిల్ కాని వ్యక్తి ఎవరూ ఉండరన్న కేటీఆర్.. ‘ఫెయిల్యూర్ ను సెలబ్రేట్ చేసుకోవాలి. మార్గం ఏదైనా కష్టపడి పని చేయటానికి మించింది ఏదీ లేదు. సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదు. నా జీవితంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఆలస్యమైనప్పుడు కొంత బాధేసింది. ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా బాధించిందన్నారు కేటీఆర్.

ఇటీవల కేంద్రమంత్రిని కలిసి హైదరాబాద్ - బెంగళూరు మధ్య డిఫెన్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయలని కోరాను. కానీ యూపీలో పెట్టాలని నిర్ణయం జరిగిపోయిందని కేంద్రమంత్రి చెప్పారు. కారణం.. యూపీలో ఎంపీ సీట్లు ఎక్కువ. ఇక్కడ తక్కువ కావటమేనని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఎంప్లాయిమెంట్ పై ఫోకస్ పెట్టిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.