బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ.!

Publish Date:Jul 16, 2026

Advertisement

 తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకగా  నిలిచే చారిత్రాత్మక ఆషాఢ మాస బోనాల జాతర  వైభవంగా ప్రారంభమైంది. గోల్కొండ కోట గోడల మధ్య భక్తి పారవశ్యం వెల్లివిరిసింది.   గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి  బంగారు బోనం,  పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.

ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఉత్సవాలకు గోల్కొండ కోట తొలి వేదిక కావడం ప్రత్యేకత. లంగర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై అమ్మవారికి ఘనంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ సాంప్రదాయబద్ధంగా మంత్రి కొండా సురేఖకు బోనం ఎత్తడం విశేషంగా నిలిచింది. అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు ఆకాంక్షించారు.

ఈ వేడుకల సందర్భంగా గోల్కొండ ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 11 లక్షల రూపాయల   చెక్కును మంత్రులు ఆలయ కమిటీకి అందజేశారు. ఈ నిధులతో భక్తులకు కల్పించే సౌకర్యాలను మరింత మెరుగుపరచనున్నారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గోల్కొండ, లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ భక్త జనంతో కిక్కిరిసిపోయాయి.  శివసత్తుల పూనకాలు, పోతురాజుల  విన్యాసాలు ఈ వేడుకలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. రంగురంగుల దుస్తులు ధరించిన పోతురాజులు డప్పుల దరువులకు అనుగుణంగా చేసిన నృత్యాలు  ఆకట్టుకున్నాయి. ఈ  బోనాల జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు   చేసింది.  

Golconda Bonalu 2026, Ashada Bonalu, Golconda Jagadambika Temple, Telangana Festivals, Hyderabad Bonalu Jatara

By
en-us Political News

  
ప్రజా రాజధాని నిర్మాణానికి రాయపూడి రైతు కుటుంబం ఉదారత.. !
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు. అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది,  అధికారిక అనుమతి పత్రాలు ఉన్న  వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.