Publish Date:May 13, 2023
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మనందం మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన బీజేపీ నేత, కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుదాకర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఆయన ఓడిపోయారు. చిక్‌బళ్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన సుధాకర్‌కు బ్రహ్మనందం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో 11, 130 ఓట్ల తేడాతో సుధారక్ ఓటమ చవి చూడాల్సి వచ్చింది. సుధాకర్ గెలుపు కోసం బ్రహ్మనందం నాలుగు రోజుల పాటు.. చిక్‌బళ్లాపూర్‌లో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో తెలుగు ప్రజల శాతం అత్యధికంగా ఉంటుంద విషయం విదితమే.
అయితే తన ప్రచారంలో బ్రహ్మనందం తాను నటించిన సినిమాల్లోని డైలాగ్‌లు పేల్చి.. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు మాత్రం ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతో లేకుంటే కాంగ్రెస్ పార్టీపై ఉన్న మక్కువతోనో.. కానీ హస్తం పార్టీకి గంపగుత్తుగా ఓట్లు గుద్దిపడేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఇక 2019లో జరిగిన చిక్ బళ్లాపూర్ ఉప ఎన్నికల్లో సైతం సుధాకర్‌కు బ్రహ్మనందం ప్రచారం చేయడంతో.. నాడు ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అయిందన్న సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-defeated-cause-of-campaign-of-bramhanandam-25-155274.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.