కాళ్లు కడిగి మరీ క్షమాపణ చెప్పిన మధ్య ప్రదేశ్ మంత్రి

Publish Date:Jan 17, 2023

Advertisement

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చూపడంలో విఫలమైతే క్షమాపణలు చెప్పుకునే సంస్కృతి ఇప్పుడు కాగడా వేసినా కనిపించదు. ఇచ్చిన వాగ్దానాలను విస్మరించడం, అదేమని అడిగితే ఆగ్రహించడం.. ఆందోళనకు దిగితే కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం ప్రస్తుతం ప్రభుత్వాలకు సర్వ సాధారణ విషయంగా మారిపోయింది.

ప్రజా వాణి వినిపించకుండా అణచివేయడమే పోలీసుల విధి అన్నట్లుగా రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తుండటం కద్దు. ఏపీ విషయాన్నే తీసుకోండి.. ఏపీ సర్కార్ మద్య నిషేధం నుంచి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల వరకూ అన్నీ కల్పిస్తామనీ, ప్రతి జిల్లాకూ ఓ హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మిస్తామనీ గత ఎన్నికల ముందు వాగ్దానాలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో మాట్లాడటం లేదు. పైపెచ్చు ఇదేమిటని ప్రశ్నిస్తున్న విపక్షాల నాయకులపై కేసులు నమోదు చేస్తోంది. సభలూ సమావేశాలూ నిర్వహించకోవడానికి వీల్లేదంటూ నిషేధాస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇక ముఖ్యమంత్రి అయితే తన పర్యటన వేల జనం ఎవరూ ఎదురుపడి ప్రశ్నించడానికి వీల్లేకుండా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు కొనసాగిస్తున్నారు.

అయితే మధ్య ప్రదేశ్ లో ఒక మంత్రి  రోడ్ల దుస్థితికి తన నిర్లక్ష్యమే కారణమని అంగీకరించారు. ప్రజలకు క్షమాపణ చెప్పారు. అంతే కాదు ఆ అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని ఆపి ఆ వ్యక్తి కాళ్లను స్వయంగా కడిగారు.   ఈ ఘటన గ్వాలియర్ లో జరిగింది. పైపులైన్ల కోసం రోడ్డును తవ్వి అలాగే వదిలేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా అయిన మంత్రి  ప్రధుమన్ సింగ్ తోమర్ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు.

ఆ రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి కాళ్లు కడిగి మరీ తక్షణమే మంచినీటి పైపుల కోసం తవ్వి వదిలేసిన రోడ్లను మరమ్మతు చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు బాగుపడే వరకూ తాను చెప్పులు ధరించనని శపథం చేశారు. వెంటనే రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభం కావడంతో  ఆయన చెప్పులు ధరించడానికి అంగీకరించారు.మధ్య ప్రదేశ్ కే చెందిన కేంద్ర  పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ తోమర్ కు కొత్త చెప్పులు అందించారు.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.