మైండ్ గేమ్ రాజకీయాలు... నాయకులను మించి ఓటర్లు!

Publish Date:Nov 21, 2022

Advertisement

తెలంగాణలో మైండ్ గేమ్ రాజకీయాలు జోరందుకున్నాయి. అయితే ఈ గేమ్ లో రాజకీయ నాయకులను మించి ఓటర్లు రాటుదేలిపోయారు. అంతే కాదు.. రాష్ట్రంలో నిత్యం రాజకీయ హీట్ కొనసాగాలని భావిస్తున్నారు.  రోగీ వైద్యుడూ ఒకటే కోరారన్న సామెతలా.. తెలంగాణలో ఏదో ఒక అంశంతో  రాజకీయాల వేడిని తగ్గకుండా రాజకీయ పార్టీలు రగిలిస్తూనే ఉన్నాయి.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తి, బీఆర్ఎస్ పార్టీ ప్రకటన,ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు, నేతల మధ్య మాటల తూటాలు, ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులు... నిరసనలు... ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఇలా రాష్ట్రంలో రాజకీయ హీట్ ను పెంచే సంఘటనలు ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడుతూనే ఉన్నాయి.  ఇది   వచ్చే  అసెంబ్లీ ఎన్నికల వరకు  నిరంతరాయంగా కొనసాగే వాతావరణమే కనపడుతోంది. దీని వల్ల పాలన కుంటుపడటం తప్ప  రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ ఇసుమంతైనా ప్రయోజనం ఉండదు.  

పోనీ.. రాజకీయ పార్టీలకైనా ప్రయోజనం ఉందా అంటే అదీ శూన్యమే. ఎందుకంటే రాజకీయ  హీట్ కాదు ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, రాష్ట్రాభిభివృద్దితోనే  మేలు జరుగుతుంది. రాజకీయాల్లో ఏ పార్టీ గెలిస్తే.. ఏముంది... షరా మామూలే. మాకేం జరుగుతుంది....? ఈ పార్టీ కాకపోతే.. ఆ పార్టీ..? ఆ పార్టీ కాకపోతే మరో పార్టీ...? ఏ పార్టీ గెలిచినా..   సమస్యలు తీరుతాయా..?   కష్టాలు గట్టెక్కుతాయా..? ఇన్నేండ్ల నుంచి చూస్తూనే ఉన్నాం... నాయకులు మారారే తప్ప... సమస్యలు పరిష్కారమైన సందర్భం లేదు.. సంపన్నులున్న ప్రాంతాల్లో రోడ్లు, పార్కులు అందంగా వస్తాయి.. కానీ బస్తీల్లో.. మాటలు ప్రకటనలు తప్ప పురోగతి ఉండదు. అన్న నిర్ణయానికి  జనం వచ్చేశారు.

అందుకే అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకుల మధ్య రాజకీయాలు రుగులుతూ ఉంటేనే ప్రయోజనం అన్న భావనకు వచ్చేశారు. పోటీ ఎంత ఎక్కువగా ఉంటే.. ఎన్నికలు అంత ఖరీదుగా   మారుతాయని జనం అంటున్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలే జనం ఈ మైండ్ సెట్ లోకి వచ్చినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మారడం, ఆ నియోజకవర్గంలో ఉపఎన్నిక రావడం.. ప్రధానంగా రెండు రాజకీయ పార్టీల నేతలకు అక్కడ గెలుపు ప్రతిష్టాత్మకం కావడం. ఫలితంగా ఉప ఎన్నిక అత్యంత ఖరీదుగా మారడంతో... ఈ నియోజకవర్గాల ఉపఎన్నికను గమనిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రజలు ప్రతినియోజకవర్గంలోనూ అలాగే జరగాలనే యోచన చేస్తున్నారని అంటున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గం ఒక మునుగోడులా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.