కాంగ్రెసుతో ఇక చేలగాటమే: మజ్లిస్
Publish Date:Jan 11, 2013
Advertisement
నిన్న మొన్నటి వరకు పాతబస్తీ పార్టీగా మిగిలిపోయిన మజ్లిస్ పార్టీ అక్బరుద్దీన్ వ్యవహారంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పాపులర్ అయిపోయింది. కాంగ్రేసుకు తోకపార్టీగా ఉండే మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ నే ఆడిస్తానంటోంది. ఇంతవరకు ఆపార్టీ ఉనికిని కూడా గుర్తించని ప్రజలు ఇప్పుడు ఆపార్టీ ఏమి మాట్లాడుతుందో, ఏమి చేస్తోందో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ విషయాన్నీ మజ్లిస్ పార్టీకూడా బాగానే గుర్తించింది. తమ్ముడు జైలుకి వెళ్తేవెళ్ళేడు గానీ పార్టీ పాతిక ఏళ్ళు కష్టపడినా సంపాదించలేని పేరు పాపులారిటీనీ రాత్రికే రాత్రే సంపాదించిపెట్టేడని సంతోషపడుతోంది. ఇదే ఊపులో రాష్ట్రం మొత్తం తన పార్టీక్యాడర్ను మెరుగు పరుచుకొని వచ్చే ఎన్నికలలో మరో పది సీట్లయినా అదనంగా గెలుచుకొని నిర్ణాయాత్మక శక్తిగా ఎదగాలని భావిస్తోంది. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వులో అక్బర్ కేసు గురించి, తదనంత పరిణామాల గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. “నిజం చెప్పాలంటే నా మాట నా తమ్ముడు అక్బర్ మాట వేరు కాదు. ఇద్దరిదీ ఒక్కటే మాట. అతనిపై ప్రభుత్వము చేస్తున్న కుట్రని మేము కోర్టుల్లో సమర్దంగా ఎదుర్కొంటాము. హైకోర్టు ఇటీవల మాపై చేసిన విమర్శలు దాని వ్యక్తిగతమే తప్ప తీర్పులో భాగంగా చూడరాదు. అందరూ భావిస్తున్నట్లు మమ్మల్ని ఏ హిందువూ వ్యతిరేకించట్లేదు. కేవలం బీజేపీ, సంఘ్ పరివార్ మాత్రమే, ఈ అంశాన్ని అవకాశంగా తీసుకొని మా పార్టీపై యుద్ధం ప్రకటించాయి. రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి కోల్పోతున్నందునే బీజేపీ ఈవిదంగా రాజకీయం చేస్తోంది. అయినా వాటిని చూసి మేము భయపడము. మా పార్టీ ఏ మతానికి, కులానికి, ప్రాంతానికి గానీ వ్యతిరేఖం కాదు. వచ్చే ఎన్నికలలో అణగారిన వర్గాలవారినందరినీ ఏకత్రాటిపైకి తెచ్చి ప్రభుత్వంలో మాభాగం పొందేందుకు తప్పక ప్రయత్నిస్తాము. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కిరణ్ కుమార్ రెడ్డే అధికారంలో కొనసాగినప్పుడే ఎన్నికలలో అతనితో చెలగాటం ఆడుకోవడంలో మాకు ఆనందం కలుగుతుంది." "తెరాస మిలియన్ మార్చ్ సందర్బంగా ట్యాంక్ బ్యాండ్ మీద ఉన్న విగ్రహాలను ఆ పార్టీ కార్యకర్తలు ద్వంసం చేస్తే కేసులు పెట్టడానికి దైర్యం లేని ప్రభుత్వం, మరిప్పుడు మాపై కేసులు పెట్టడానికి ఎవరిని చూసుకొని అంట దైర్యం వచ్చిందంటే బీజేపీ వల్లనే అంటాము. అదే విదంగా బాబ్రీ మసీదు కూల్చినవారిపై కేసులు పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీని ఎందుకు లక్ష్యం చేసుకొంటోందిప్పుడు? ఆ రెండు పార్టీలు కుమ్మకయి మా పార్టీపై తప్పుడు కేసులు వేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నాయి. అయితే, మా తడాఖా ఏమిటో వచ్చే ఎన్నికలలో తప్పక చూపిస్తాము.”
http://www.teluguone.com/news/content/mim-president-24-20357.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





