పిఠాపురంలో మెగాస్టార్ ప్రచారం.. డేట్ కన్ ఫర్మ్?

Publish Date:Apr 27, 2024

Advertisement

రాజకీయాలను తాను వదిలేసినా రాజకీయాలు తనను వదల లేదంటూ చిరంజీవి ఏదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది.  అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత  కొంత కాలం రాజకీయాల్లో ఉండీ  లేనట్లు కొనసాగారు. అంతే  ఆ తర్వాత చిరంజీవి రాజకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు.  తమ్ముడు పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు  ఎన్నికల్లో పోటీ చేసినా చిరంజేవి మాత్రం   ఆ దిక్కు  అడుగేయలేదు సరికదా కనీసం ఓ లుక్కు కూడా వేయలేదు.  

కానీ  చిరంజీవి  పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష  బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని  భావించారు. ఇందుకోసం చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాంద్ కి అప్పగించారు.  ఆవసరమైతే    తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని రాహుల్ అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వీటికి వేటికీ స్పందించలేదు. సై అనలేదు. రాజకీయం తన వంటికి పడదు అన్నట్లుగా మౌనంగానే ఉండి పోయారు. 

ఆ తరువాత కూడా మళ్లీ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఎప్పుడంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సినిమా టికెట్  రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి  చర్చలు జరిపారు.  ఆ సమయంలో   చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూపెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వాటన్నిటినీ ఖండించి రాజకీయాలకు తాను దూరం అని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపారు. 

ఆ తరువాత మరోసారి చిరు పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ సందర్భం అల్లూరి సీతారామరాజు జయంతి సభ. భీమవరంలో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజాలు ఉన్న ఆ వేదికపై ప్రధాని మోడీ వారందరి కంటే చిరంజీవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వయంగా ఎదురెళ్లీ మరీ స్వాగతం పలికారు. ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. దీంతో చిరంజీవి బీజేపీ గూటికి చేరడం ఖాయమని పరిశీలకులు విశ్లేషణలు సైతం చేశారు. తరువాత మళ్లీ మామూలే చిరంజీవి మాత్రం రాజకీయాలతో తన దూరాన్ని మెయిన్ టైన్ చేశారు. 

అయితే ఇప్పుడు అంటే ఏపీలో ఎన్నికల వేళ ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన కూటమి తరఫున ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ సారి వాటిని చిరంజీవి ఖండించలేదు. దీంతో పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు పలికి, ఆయనకు ఓటేసి గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చిన తరువాత సోదరుడు పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి వెనుకాడరని అన్నారు.

ఇప్పుడు చిరంజీవి కూడా తన సోదరుడి విజయం కోసం ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే నెల 5 నుంచి ఆయన పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలలో పాల్గొననున్నారు. తన కుమారుడు హీరో రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనున్నారు.  చిరు ప్రచారంలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులూ, బీజేపీ, తెలుగుదేశం శ్రేణులూ కూడా పాల్గొనేలా కూటమి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. అదే విధంగా ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కోసం కూడా ప్రచారం చేసే అవకాశం ఉందం టున్నారు. అంటే చిరంజీవి ప్రచారం పిఠాపురం, అనకాపల్లికే పరిమితమైనా ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్లస్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రగిరి వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెంచి పోషిస్తున్న రౌడీలు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై బీర్ బాటిళ్ళు, సమ్మెటలు, రాళ్లతో దాడి చేశారు.
జగన్ బ్రెయిన్ ఛైల్డ్ అయిన ‘వైనాట్ 175’ సిద్ధాంతానికే గండి కొట్టేశారు. రాయలసీమలో గత ఎన్నికలలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి 35 నుంచి 40 సీట్లు వస్తాయి అని డిక్లేర్ చేశారు.. అద్గదిగో.. ఇక్కడ వైసీపీ వర్గాల గుండెల్లో పెద్ద బండరాయి పడింది..
2019తో 2024 పోలింగ్ ను పోల్చితే 2 శాతం తేడా క‌నిపిస్తోంది. 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం న‌మోదయితే ఈసారి 2024 లో పోలింగ్ 81 శాతాన్ని దాటిపోయేలా వుంది. దీన్ని బ‌ట్టి ఫ‌లితం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. తెలుగుదేశం కూటమికి 155 నుండి 160 సీట్లు, వైఎస్సార్సీకి 15 నుండి 21 అసెంబ్లీ సీట్లు, 2 లేదా 3 పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పిల్ల చేష్టలకి, మూడు రాజధానుల కుప్పిగంతులను వైజాగ్ ఓటర్లు మొట్టికాయలతో చక్కదిద్దారు.
జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో జగన్ పార్టీ మూటాముల్లె సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్తా జూన్ 4న పూర్తైపోతుంది అన్నది ఇప్పటి వరకూ పరిశీలకులు, విపక్ష కూటమి నేతలూ చెబుతున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడటానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్నా.. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐప్యాక్ నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల పోలింగ్ స్టేషన్లలో మంగళవారం (మే14) తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. తమ వంతు వచ్చే వరకూ ఓటర్లు ఓపికతో ఎదురు చూస్తే రాత్రంతా జాగారం చేయడం ఓటరు చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
ఏపీకి జాతీయ హోదా దక్కుతుందో, లేదో గానీ, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి మాత్రం జాతీయ హోదా దక్కేట్టుంది.. అదెలాగయ్యా అంటే...
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వెల్లువెత్తింది. కొత్త ఓటర్లు, యువత తమ భవిష్యత్ ఓటుతోనే ముడిపడి ఉందని భావించారు. అందుకే పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఇక మధ్యతరగతి, దిగువ మధ్య తరగలి వారు తమ ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఓటేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడమే మార్గమని నిర్ణయించుకున్నారు.
అవసరం ఉన్నా లేకున్నా మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకునే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల గొంతులు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ మూగబోయాయి. ఎక్కడా వారి మాట వినిపించడం లేదు. వారికి మాత్రమే అలవాటైన భాషలో ప్రసంగాలు చేయడం లేదు.
కిందపడ్డా నాదే పైచేయి అంటారు చూశారా.. అలా వుంది నగరిలో మటాష్ అవబోతున్న రోజా వ్యవహారం. మొదటగా నగరి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పదేళ్ళుగా మీ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన రోజాని మీ ఓటు ద్వారా సాగనంపారు.
ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించడం రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తాడు అని చెబుతున్నప్పుడు కేసీఆర్ ముఖంలోగానీ, కేటీఆర్ ముఖంలోగానీ కనిపించే పైశాచిక ఆనందాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు.
పోలింగ్ శాతం పెర‌గ‌డంతో వైసీపీ మ‌రింత డీలా ప‌డింది. ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంది. మ‌రోవైపు.. యువ‌త పోటెత్తారు. కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న‌వారు కూడా ఈ సారి ఓటేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ క‌నిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.