Publish Date:Sep 22, 2024
మెగాస్టార్ చిరంజీ మరో ప్రపంచ రికార్డ్ సాధించారు. ఆయనక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 156 చిత్రాలలో నటించిన చిరంజీవి 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్ మెంట్స్ చేశారు. మరే నటుడు ఇన్ని పాటలకు స్టెప్పులేసి దాఖలాలు లేవు. అందుకే చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఈ అవార్డును అందించడం కోసం గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా హైదరాబాద్ కి వచ్చారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డును చిరంజీవికి అందించారు.
చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పొందారు. ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి మరో ఘనత సాధించారు. దీంతో మెగా అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొని, మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకునే వేదికపై ఓ వక్త వెల్లడించారు. చిరంజీవి 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ వేడుకకు హాజరయ్యారని, అది ఆయనకున్న డెడికేషన్ అని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి అయితే చికెన్ గున్యా నుంచి పూర్తిగా కోలుకుంటున్నారని, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mega-star-chiranjivi-world-record-25-185358.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.