మీనా గారూ.. ఏపీ గురించీ ప్రార్థించండి!

Publish Date:Apr 12, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల వర్క్.లో బిజీగా వున్నారు. మధ్యమధ్యలో కాస్త వెసులుబాటు కల్పించుకుని రాష్ట్రంలో వున్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన సతీమేతంగా తిరుమల శ్రీవారిని సందర్శించారు. దేవాలయం నుంచి ప్రశాంత వదనాలతో బయటకి వచ్చిన ముఖేష్ కుమార్ మీనా కుటుంబాన్ని చూస్తుంటే, ఏపీ ఎన్నికలు కూడా ఇంతే ప్రశాంతంగా జరిగితే బాగుండు కదా.. ఎన్నికల సందర్భంగా ఓటర్లు కూడా ఇంత ప్రశాంతంగా ఉండగలిగితే బాగుంటుంది కదా అనిపించింది. 

గత ఎన్నికల సందర్భంగా అధికారంలో లేకపోయినప్పటికీ వైసీపీ గూండాలు చేసిన అరాచకాలు, ప్రజాస్వామ్యంతో ఆడిన పరాచికలు చూశాం. రాజకీయాలు ఇలా కూడా వుంటాయా అనుకుని ఆశ్చర్యపోయాం. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే భయంలో ఏపీ ప్రజలు వున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్  మీనా పనితీరును చూస్తుంటే ఈసారి వైసీపీ తప్పులు ఉడకవన్న నమ్మకం కలుగుతోంది. ఎందుకంటే, లేట స్ట్.గా ఆయన, ప్రభుత్వ సలహాదారు హోదాలో వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న సజ్జలకి వార్నింగ్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనాకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒక విన్నపం. అదేంటంటే, ముఖేష్ గారూ, మీరు ఏపీలో మీకు వీలైనన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించండి. మీ కుటుంబం మేలు కోసం ప్రార్థించండి. పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కూడా ప్రార్థించండి. ఎన్నికలు సక్రమంగా జరగాలని, దొంగ ఓట్లు పడకూడదని, దౌర్జన్యాలు జరక్కూడదని, రిగ్గింగుల్లాంటివి జరక్కూడదని, ఓటింగ్ ప్రక్రియలోకి వైసీపీ కార్యకర్తల్లాంటి వాలంటీర్లు ఎంటరవ్వకూడదని, పోలింగ్‌కి - కౌంటింగ్‌కి మధ్య ఏ గూడుపుఠానీలు జరక్కూడదని, కౌంటింగ్ న్యాయంగా జరగాలని ప్రార్థించండి సార్... పోనీ, అలా ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, పైన పేర్కొన్న న్యాయమైన విషయాలు అమ లయ్యేలా ఒక నిస్పాక్షిమైక ఎన్నికల అధికారిగా పనిచేయండి.

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.