కడపలో ఫ్యామిలీ ఫైట్.. రంగంలోకి వైఎస్ భారతి?!

Publish Date:Apr 12, 2024

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అడ్డా కడప గడ్డ. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి 1984 నుంచి వరుసగా వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అటువంటి కడప గడ్డపై ఇప్పుడు ఎన్నికల పోరు వైఎస్ కుటుంబ సభ్యుల మధ్యే జరుగుతుండటం విశేషం. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు కడప బరిలో ప్రధాన ఎన్నికల అజెండాగా మారిపోయింది.

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్వయంగా కడప లోక్ సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. వైసీపీ తరఫున ఇక్కడ రెండో సారి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్యకు కుట్రదారుడు అవినాష్ రెడ్డి అనీ, ఆయనను తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నాడనీ ఆరోపిస్తూ షర్మిల నియోజకవర్గాన్ని చుట్టేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  అవినాష్ రెడ్డిని, ఆయనను కాపాడుతున్న తన అన్న జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే ఏకైక ఎజెండాతో షర్మిల కడప బరిలో పోటీకి దిగారు.  ఇక షర్మిలకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మద్దతుగా నిలుస్తూ ఆమె కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటం అవినాష్ కే కాకుండా ముఖ్యమంత్రి జగన్ కు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. కడప బరిలో షర్మిల పది శాతం ఓట్లు సాధిస్తే అవినాష్ ఓటమి ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అసలే షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ వైఎస్ కు దన్నుగా ఉన్న కాంగ్రెస్ సంప్రదాయ ఓటు దాదాపుగా కాంగ్రెస్ వైపు మళ్లిపోవడం ఖాయమన్న అంచనాల మధ్య కడప బరిలో షర్మిల పోటీ   ఆ నియోజకవర్గంలో అవినాష్ గెలుపు అవకాశాలను సంక్షిష్టం చేసింది.  షర్మిలకు ఎంత  మేరకు ఓటింగ్ శాతం పెరిగితే అంత మేరకు కడపలో తెలుగుదేశం విజయం, మెజారిటీ పెరుగుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఎలా చూసినా కడప లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ కు గడ్డు పరిస్థితులే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.   1984 తర్వాత జరిగిన కడప నియోజకవర్గానికి జరిగిన పది ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే గెలుపొందారు. ఇప్పుడు ఆ ఒరవడికి గండి పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. 

కడపలో షర్మిల పోటీ ప్రభావం పులివెందుల నియోజకవర్గంపై కూడా పడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో  షర్మిల ప్రభావం జగన్ విజయంపై ఏ మేరకు పడుతుందన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతున్నది. కపడలో వైఎస్ కుటుంబ సభ్యుల రాజకీయ రణం.. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నది. 
పులివెందులలో జగన్ ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సరిగ్గా ఆరోజు నుంచే జగన్ సతీమణి వైఎస్ భారతి భర్త తరఫున పులివెందులలో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పులివెందులలోనే క్యాంప్ చేసి ఆమె జగన్ ఎన్నికల ప్రచార భారాన్ని తన భుజస్కంధాలపై మేయడానికి రెడీ అయిపోయారు. పులివెందులలో జగన్ విజయం కాదు మెజారిటీ కూడా పెంచుకోవడమే లక్ష్యంగా భారతి వ్యూహరచన చేస్తున్నరని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. పులివెందులలో మెజారిటీని గణనీయంగా పెంచుకోవడం ద్వారా కడప లోక్ సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి రెండో సారి ఎంపీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు.  మరి కడప జనం ఈ ఫ్యామిలీ ఫైట్ లో ఎటువైపు అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.