Publish Date:Aug 12, 2022
బస్సుల్లో, ఆటోల్లో చాలాసార్లు మనం చాలాసార్లు రూపాయి, రెండురూపాయలు వదిలేస్తూ ఉంటాం. చిల్లర లేదని డ్రైవర్లు నొక్కేస్తుంటారు. కానీ తుంగనాధ్ చతుర్వేదీ ఇరవై రూపాయల కోసం ఏకంగా రైల్వే వారిని కన్స్యూమర్ కోర్టుకు ఈడ్చాడు. ఇరవయ్యేళ్లు కేసు నడిచిన తర్వాత ఆయనకు రూ.15000 చెల్లించమని కోర్టు ఆదేశించింది. దేశంలో కన్స్యూమర్ చట్టం అంటూ ఒకటి ఉందని చాలామంది ఇప్ప టికైనా తెలుసు కుంటే మంచిది.
చతుర్వేది అనే లాయరు 1999లో మధురనుంచి మొరాదాబాద్‌కు రైల్లో వెళ్లారు. టిక్కెట్ విషయంలో పెద్ద గొడవే జరిగింది. అప్పట్లో మధుర నుంచి మొరాదాబాద్‌కు టిక్కెట్ 35 రూపాయలు. కానీ బుకింగ్ కౌంటర్ లో ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఆయన వందరూపాయలు ఇస్తే 70 రూపాయలు తీసుకోవా ల్సింది 90 రూపాయలు తీసుకుని పది రూపాయలు ఇచ్చారు. చతుర్వేది రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే భయ్యా, జర లైట్ తీసుకో అన్నారట. ఆయనకి కోపం వచ్చింది. అంతే వెంటనే ఈశాన్య రైల్వే బుకిం గ్ క్లర్క్ మీద కన్స్యూమర్ కోర్టులో కేసు వేశారు. వందకు మించి కోర్టు వాదనలు జరిగాయి. అన్ని రోజు లు అన్నిసార్లూ చతుర్వేది కోర్టుకు వెళ్లారు. ఆయన నిజానికి అంత ఆరోగ్యవంతుడు కాదు. అయినా రైల్వే క్లర్కుకు, రైల్వే వారికి బుద్ధిచెప్పాలన్న పట్టుదలతోనే చాలా సహనం ప్రదర్శించారు.
ఈ కేసు 22 ఏళ్లు నడిచింది. చివరికి సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన ఒక కేసు తీర్పు ఆధారంగా ఇలాంటి కేసులు కన్స్యూమర్ కోర్టు తీర్పు ఇవ్వచ్చని తేలింది. అంతే రైల్వేవారికి గుండెల్లో రాయి పడింది. అసలు అప్పుడే ఆ ఇరవై రూపాయలు ఇచ్చుంటే సరిపోయేది. ఏదో ముసలాయన కదా ఏం చేస్తాడులే అని క్లర్కు లు దబాయించారు. కానీ కన్స్యూమర్ కోర్టు తీర్పు తాటతీసింది. చతుర్వేదీకి వడ్డీతో సహా 15000 నెల రోజుల లోపు చెల్లించాలని ఆదేశించింది. మొనగాడంటే ఈడ్రా బుజ్జీ అన్నారు మధుర వారంతా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mathura-man-won-case-against-rlys-25-141813.html
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.