వాష్‌రూమ్ కిటికీ పగులగొట్టి ఎంట్రీ.. కిలో బంగారు ఆభరణాలు చోరీ..!
Publish Date:Jul 20, 2026
Advertisement
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. రోడ్ నెం.10లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ కార్యాలయాన్ని గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు. ప్రధాన ద్వారం జోలికి వెళ్లకుండా అత్యంత చాకచక్యంగా వాష్‌రూమ్ కిటికీని ధ్వంసం చేసి మెల్లిగా లోపలికి ప్రవేశించిన దుండగులు, నేరుగా లాకర్ వద్దకు చేరుకుని తమ పని పూర్తి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈరోజు ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది లాకర్ తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించారు. అనుమానంతో లాకర్‌ను తనిఖీ చేయగా అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు కార్యాలయాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్‌లో భద్రపరిచిన 1,028.59 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటిలో ఏడు నెక్లెస్లు, ఏడు జతల చెవిపోగులు ఉన్నట్లు తెలిపారు.గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాలు వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లను సేకరించాయి. అలాగే పరిసర ప్రాంతా ల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని దుండగుల కదలికలను విశ్లేషిస్తు న్నాయి. వాష్‌రూమ్ కిటికీని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించడం, నేరుగా లాకర్‌లోని బంగారు ఆభరణాలనే లక్ష్యంగా చేసుకోవడం చూస్తే దుండగులకు ముందస్తు సమాచారం లేదా రెక్కీ ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే గుర్తిస్తామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. Massive theft in Banjara Hills, Kilogram of gold ornaments stolen, Banjara Hills Police, CM Revanth reddy, Telangana police, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand
http://www.teluguone.com/news/content/massive-theft-in-banjara-hills-36-226502.html





