బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది. బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ దొంగతనం వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్టు పోలీసులకు అనుమానం కలుగుతోంది.
నిన్న రాత్రి వేళ, ఇంట్లో ఎవరి లేకపోయిన సమయాన్ని సరిగ్గా ఎంచుకున్న దొంగలు, చాలా జాగ్రత్తగా ఇంట్లోకి ప్రవేశించారు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వారు నేరుగా విలువైన వస్తువులు ఉన్న చోటుకే వెళ్లినట్టు సమాచారం. ముఖ్యంగా సేఫ్‌లో భద్రపరిచిన సుమారు కోటిన్నర రూపాయల నగదును తీసుకొని, వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయినట్టు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి.
ఉదయం ఇంటి సభ్యులు వచ్చి చూసినప్పుడు ఇంటి తాళం పగులగొ ట్టనట్టు ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సనత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని ప్రతి మూలను పరిశీలిస్తూ క్లూస్ సేకరించారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు కీలకంగా తీసుకుని దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది సాధారణ దొంగతనం కాదని, ఇంటి లోపలి సమాచారం తెలిసిన వ్యక్తుల సహకారం ఉండొచ్చన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోటిన్నర రూపాయల భారీ చోరీ కావడంతో ఈ ఘటన నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/massive-theft-at-brs-leader-suresh-reddys-house-mpsuresh-reddy-36-222147.html
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.