ట్రంప్ పై మస్క్ పేల్చిన ఎప్ స్టీన్ బాంబు.. అధ్యక్ష పీఠానికి ఎసరేనా?
Publish Date:Jun 7, 2025
Advertisement
ఎప్ స్టీన్ మామూలోడు కాడు. ఇటు బిల్ క్లింటన్ లాంటి ప్రెసిడెన్షియల్ పర్సనాల్టీస్.. అటు హాలీవుడ్ హీరోస్ తో కస్టమైజ్డ్ ప్రైవేట్ జెట్స్ లో ఆఫ్రికా పర్యటన చేసికొచ్చిన రకం. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఎప్ స్టీన్ ఎలాంటివాడో. అంతే కాదు.. ఎప్ స్టీన్ కి ఏకంగా ఒక మైనర్ బాలిక తో ఎఫైర్ ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడి పామ్ బీచ్ హౌస్ నిండా ఆమె ఫోటోలున్నట్టు గుర్తించారు పోలీసులు. మైనర్ అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్. ఇతడు ఇంగ్లాండ్ రాజకుమారుడితో దిగిన ఫోటో ఒక సంచలనం. అంతేనా ఇతడిపై న్యూయార్క్ లో ఒక కేసుంది. ఆ కేసు ప్రకారం ఇతడు మైనర్ బాలికలతో సెక్స్ రాకెట్ నడిపినట్టుగా చెబుతున్నాయి రికార్డులు. ఇతడికీ ట్రంప్ కి 1994 నుంచి సంబంధాలున్నాయి. ఇద్దరూ కలసి పార్టీలకు వెళ్లిన దాఖలాలున్నాయి. అంతే కాదు.. ఎప్ స్టీన్ తనకు అత్యంత సన్నిహితమైన మిత్రుడని న్యూయార్క్ మేగజైన్ కి 2002లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ స్వయంగా చెప్పారు. ఆ టైంలో ట్రంప్ చేసిన మరో కామెంట్ ఏంటంటే.. అతడికి నాకులాగా అందమైన అమ్మాయిలంటే ఇష్టం. అది కూడా చిన్న వయసు వారు కావడం విశేషమంటూ అప్పట్లోనే ఓపెన్ అయ్యారు మిస్టర్ ట్రంప్. ఇక ట్రంప్ గురించి .. క్రాసింగ్ ద లైన్.. ట్రంప్ విత్ విమన్ ఇన్ ప్రైవేట్ టైం.. అంటూ న్యూయార్క్ టైమ్స్ మేగజైన్ ప్రచురించిన .. కథనంలో ఆసక్తికరమైన అంశాలు బయట పడ్డాయి. ఏ రొమాంటిక్ హాలీవుడ్ మూవీకి తీసిపోననంత రొమాంటిక్ లైఫ్ ను ట్రంప్ అనుభవించినట్టు చెబుతుందీ కథనం. ట్రంప్ కి 1970 నుంచి పాతిక మంది వరకూ మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్టు పేర్కొంది. మోడలింగ్ చేసే టైంలో, అందాల పోటీల సమయంలో, ఇతర పని ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడని. ఆ కథనం పేర్కొంది. అయితే ట్రంప్ మీద ఇప్పటి వరకూ ఏ ఒక్క మహిళ ఫిర్యాదు చేయలేదు. అయితే 2016లో ఓ మహిళ ట్రంప్ పై మూడు సార్లు దావా వేసి ఉపసంహరించుకుంది. ఇందుకు బెదరింపులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటికి ఆధారాలు లేవు. అందుకే ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలను వై విమెన్ నాట్ రిపోర్ట్? అంటూ క్యాంపెయిన్ చేసి గట్టెక్కారు. వారంతా తనపై డబ్బుకోసమో, పేరు కోసమో ఇలా చేస్తారంటూ తిప్పి కొడతారు. ఇక పోతే ట్రంప్ కుటుంబం ఆయన్ని గట్టిగా వెనకేసుకు వస్తున్నది. ఆయన ఆడియో టేపులు బయట పడడాన్ని ఒక కుట్రగా అభివర్ణించారు ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్. ఇక ఆయన సతీమణి మెలానియా అయితే మా ఆయన జెంటిల్ మెన్ అన్నారు. ఆయన ఎదుగుదల ఓర్చుకోలేక గిట్ఇటని వారే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం మస్క్ వెలికి తీసిన ఎప్ స్టీన్ 2019లో అరెస్టు కాగా అతడ్ని న్యూయార్క్ జైల్లో ఉంచారు. అయితే అతడు అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఈ విషయంలోనూ ఎన్నో అనుమానాలున్నాయి.. వీటన్నిటి దృష్ట్యా మస్క్ ట్రంప్ పై ఈ బాంబు వేశారు. ఇదిప్పుడు ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. ట్రంప్ ని అధ్యక్ష పీఠం నుంచి తొలగించి.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్న డిమాండ్ జోరందుకుం టోంది. ఇప్పుడు సిట్యువేషన్ ఎలా తయారైందంటే.. ఎవరైనా ఎనిమీతో పెట్టుకున్నా బతికి బాగు పడతారామోగానీ.. ఒక ఫ్రెండ్ ఎనిమీ అయితే మాత్రం ఇదిగో ట్రంప్ వర్సెస్ మస్క్ లా తయారవుతుందన్న మాట వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/mask-allegation-on-trump-25-199476.html





