ఆమె, భర్త ఫస్ట్ నైట్ ఒప్పుకున్నాడు .. ఎందుకో తెలుసా..?
Publish Date:Jun 9, 2021
Advertisement
మంచి కుటుంబం. అబ్బాయి కూడా గుణవంతుడు. అంతకుమించి బాగా చదువుకున వాడు. త్వరలోనే విదేశాల్లో స్థిరపడడానికి ఫ్లయిట్ ఎక్కుతున్నాడు. మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని అమ్మాయి తల్లిదండ్రులు తెగ మురిసిపోయారు. కూతురు కూడా అబ్బాయిని అతని పనిని ఇష్టపడటంతో భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. చివరికి అది పూజకు పనికిరాని పూవు అని తెలిసింది.. ఆ తర్వాత ఏముంది.. తల్లి దండ్రులు కూతురు లబోదిబోమని ఏడిచారు.. కట్ చేస్తే ఆ రోజు నైట్ శోభనం.. అందరూ కలిసి అమ్మాయిని ముస్తాబు చేశారు.. కొంత మంది పెద్దలు పెళ్లి కూతురికి టిప్స్ చెప్పారు.. అందరూ కలిసి సినిమాలో లాగ పాల గ్లాస్ చేతిలో పెట్టి రూమ్ లోకి పంపించారు.. ఇక అంటే అమ్మాయికి చెమటలు పట్టించాల్సిన పెళ్లి కొడుకు వణుకుతున్నారు.. అమ్మాయి దగ్గర అయింది.. అబ్బాయికి చెమటలు చిన్న పాటి కాలువల్లా పారుతుంది తన వంటి మీద.. దూరం దూరం వెళ్తున్నాడు.. ఏంటని ఆరా తీస్తే తను నపూసకుందని తెలిసింది. సంసారానికి పనికిరాని. పూజకు పనికిరాని పువ్వు అని తెలిస వధువు కంగుతింది. అయితే ఈ విషయం బయటపెట్టి తన పరువు తీయొద్దని భర్త వేడుకోవడంతో మిన్నకుండిపోయింది. మరుసటి రోజు వరుడి తల్లిదండ్రులు విజయవాడలో రిసెప్షన్ ఏర్పాటు చేయగా యువతి తరుపు బంధువులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతి తన సమస్యను కుటుంబసభ్యులకు చెప్పి భోరుమంది. దీంతో వారు వధువును పుట్టింటికి తీసుకొచ్చేశారు. దీనిపై ఇరుపక్షాల పెద్దలు పలుమార్లు సంప్రదింపులు జరిపారు. భర్త తీరుతో పుట్టింట్లోనే ఉండిపోయిన ఆమెను అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. అది గుంటూరు జిల్లా. తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన యువతి. ఆమె వయసు 20 సంవత్సరాలు. అయితే విజయవాడ ఆటోనగర్‌కు చెందిన యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన వివాహం జరిగింది. అతడు ప్రస్తుతం ప్రైవేటు కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నాడు.. త్వరలోనే ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్తాడని, పెళ్లి చేసుకుని భార్యను కూడా అక్కడికి తీసుకెళ్తాడని తల్లిదండ్రులు చెప్పారు. వీసా, ఇతర పత్రాలన్నీ చూపించడంతో యువతి తల్లిదండ్రులు మంచి సంబంధం దొరరికిందని మురిసిపోయారు. వారు అడిగినట్లుగా రూ.10 లక్షల కట్నం, ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం చేశారు. ఇటీవల విజయవాడలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా రిసెప్షన్ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు పెట్టామని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని యువకుడు, అతని తరఫు వారు డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా వధువు, ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. దీంతో యువతి భర్త, అత్తింటి వారిపై తెనాలి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/married-woman-complained-on-husband-and-his-family--39-117285.html





