పెళ్లి సందడి కోసం... ఎంత అప్పుకైనా సిద్ధం

Publish Date:Mar 15, 2017

Advertisement

టాటా కేపిటల్, ఖాతాదారులకు రుణాలను అందించే సంస్థ. చదువులు, ఇల్లు కట్టుకోవడం వంటి అవసరాలతో పాటుగా పెళ్లి కూడా జేబులని గుల్లచేసే సందర్భమే అని ఈ సంస్థ గ్రహించింది. మన దేశంలో పెళ్లి ఖర్చుల పేరుతో దాదాపు 700 కోట్ల రూపాయల వరకూ వ్యాపారం జరుగుతోందట. ఇక అనధికారికంగా సాగే ఖర్చులు, కట్నాల గురించి చెప్పేదేముంది. అందుకే పెళ్లిళ్లకి కూడా అప్పులు ఇస్తాం అంటూ టాటా కేపిటల్‌, బజాజ్ ఫిన్‌సర్వ వంటి సంస్థలు ముందుకువస్తున్నాయి. పెళ్లి కోసం 25 లక్షల వరకూ అప్పులు ఇస్తున్నాయి.

 


ఈ నేపథ్యంలోనే టాటా కేపిటల్‌ సంస్థ పెళ్లి ఖర్చుల గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 2,500 మంది పాల్గొన్న ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

 


- నూటికి 74 శాతం మంది పెళ్లి ఖర్చుల బడ్జట్ పది లక్షల వరకూ పెట్టవచ్చన్న అంచనాలో ఉన్నారు. 
- 27 శాతం మంది పెళ్లి కోసం అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టామన్న పశ్చాత్తాపంలో ఉన్నారు.
- ఒకప్పుడు పెళ్లంటే బంధువులకి మర్యాదలు చేయడం, బాజాభజంత్రీలు, హనీమూన్‌కి వెళ్లడం వంటి ఖర్చులకే అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. కానీ ఇప్పటి తరంలో దాదాపు 66 శాతం మంది వివాహ దుస్తులు, ఆభరణాలు, మేకప్‌ వంటి ఆడంబరాలకే అధిక ప్రాధాన్యత అని చెప్పేశారు.
- టాటా కేపిటల్‌వారి గుండెల అదిరిపోయేలా 44 శాతం మంది అసలు పెళ్లిళ్లకి అప్పులు ఇస్తారన్న విషయమే తమకు తెలియదని చెప్పారు. అయితే పెళ్లి ఖర్చుల కోసం ఒకవేళ రుణం దొరుకుతుంటే... దానిని అందిపుచ్చుకునేందుకు 58 శాతం మంది సిద్ధంగా ఉన్నారు.
- 30 ఏళ్లలోపు వారు ఆర్భాటంగా పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. 30 ఏళ్లు పైబడినవారు మాత్రం ఏదో నామమాత్రంగా పెళ్లిసాగిపోతే చాలు అనుకుంటున్నారట.
- 50 శాతం మంది మగవారు ఓ ఐదు లక్షల రూపాయలలోపు ఖర్చుతో పెళ్లి ముగించేయాలని అనుకుంటున్నారు. కానీ ఆడవారిలో 32 శాతం మాత్రమే ఇలా తక్కువ ఖర్చులో పెళ్లి జరిగేందుకు ఇష్టపడుతున్నారు.
- తమ పెళ్లి ధూంధాంగా 30 లక్షల వరకూ ఖర్చుతో సాగాలని ఒ 22 శాతం మంది మగవారు కోరుకుంటున్నారు. ఆడవారిలోనేమో ఆర్భాటంగా పెళ్లి జరగాలని కోరుకునేవారి సంఖ్య 36 శాతంగా ఉంది.
- తీరా పెళ్లి చేసుకుని పద్దులన్నీ చూసుకున్నాక, జరిగిన ఖర్చులని చూసి లబోదిబోమంటున్నారు కుర్రకారు. కనీసం మూడోవంతు మంది యువతులు, తమ పెళ్లి ఖర్చులు అనుకున్నదానికన్నా పదిలక్షలు ఎక్కువగా తేలాయని బాధపడ్డారట.

 

- నిర్జర.

By
en-us Political News

  
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.