Publish Date:Mar 25, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి .ఈయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలపై ఈ నెల 22న ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ ప్రజా దర్బార్ నిర్వహించిన నారాయణరెడ్డి ప్రజల ముందు సెలైన్ పెట్టించుకుని ఓవర్ యాక్షన్ చేయడం నవ్వులపాలవుతోంది. మహిళా దినోత్సవం పురస్కరించుకుని సిఎం చంద్రబాబు ఇటీవల మార్కాపురం వచ్చారు. తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల మీటింగ్ లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలు అంటించారు. తీరు మార్చుకోకపోతే పోతే చర్యలు ఉంటాయని తీవ్రంగానే హెచ్చరించారు.
సిఎం చంద్రబాబు ఎమ్మెల్యే కందులపై అలా కార్యకర్తల ముందు మండిపడటంతో ఆయన పరువు పొయినట్లైంది. సొంత క్యాడర్ ముందు డ్యామేజ్ అయ్యానని ఆయన తెగ ఫీల్ అవుతున్నారంట. ఆ క్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రజలలో సానుభూతి పొందటానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్భర్ లో సెలైన్ పెట్టించుకోవడం అందులో భాగమే అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/markaapuram-mla-over-action-25-194995.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.