జుకర్‌బర్గ్ గిఫ్ట్.. పెళ్ళాం ఫ్లాట్!
Publish Date:Aug 14, 2024
Advertisement
మొగుడు మంచి గిఫ్ట్ ఇస్తే ఫ్లాట్ అయిపోని పెళ్ళాం ప్రపంచంలో ఎక్కడా వుండదు. అది ఇండియా కావచ్చు.. అమెరికా కావచ్చు.. ఆ మొగుడు పేపర్లు ఏరుకునే వాడు కావచ్చు.. ఫేస్‌బుక్ ఓనర్ కావచ్చు.. మొగుడు మొగుడే.. పెళ్ళాం పెళ్ళామే.. ఆ గిఫ్ట్ ధరతో సంబంధం లేదు.. మొగుడు గిఫ్ట్ ఇచ్చాడంటే పెళ్ళాం ఫ్లాట్ అయిపోవాల్సిందే.. ఇది ప్రకృతి నియమం. ఈ నియమం ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకర్‌బర్గ్‌కి బాగా తెలిసినట్టుంది.. తన భార్య ప్రిస్కిల్లా చాన్‌కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి ఫ్లాట్ చేసేశాడు. ఆ గిఫ్ట్ కూడా అల్లాటప్పా గిఫ్ట్ కాదు.. తన భార్య విగ్రహాన్ని తయారుచేయించి ఆమెకే గిఫ్టుగా ఇచ్చాడు. రోమన్ సంప్రదాయంలో తన భార్య ప్రిస్కిల్లా చాన్ విగ్రహాన్ని రూపొందించి తమ ఇంటి పెరట్లో వుంచాడు. ఆ విగ్రహం ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ, వెండి వస్త్రంతో కప్పినట్టుగా వుంది. తానెంతో ప్రేమించే భార్య విగ్రహాన్ని చెక్కించి, ఆమెకే బహుమతిగా ఇవ్వడం రోమన్ చర్రితో వుందట. ఈ విషయాన్నే జుకర్‌బర్గ్ తెలియజేస్తూ, ‘‘భార్య విగ్రహాన్ని చెక్కించే రోమన్ సంస్కృతిని తిరిగి తీసుకొచ్చాం’’ అని పేర్కొన్నారు. తన భార్య విగ్రహాన్ని చెక్కిన శిల్పి డేనియల్ అర్షమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త తనకు తననే కానుకగా ఇవ్వడంతో ప్రిన్కిల్లా చాన్ మురిసిపోతోంది, తన భర్తని ఉద్దేశించి ఒక పోస్టు పెడుతూ, అందులో ‘మీరు నన్ను మిస్ కాలేరింక’ అని పేర్కొన్నారు. బాగుందమ్మా భార్యాభర్తల అన్యోన్యత! మీరు ఎవరి కంట్లో అయినా పడండిగానీ, మా వేణు స్వామి కంట్లో మాత్రం పడకండి.. జ్యోతిషం చెప్పి మీ భవిష్యత్తుని బుగ్గిచేసి పారేస్తాడు!
http://www.teluguone.com/news/content/mark-zuckerberg-installs-priscilla-chans-life-size-sculpture-in-their-backyard-39-182954.html





