Publish Date:Jul 22, 2024
ఆంధ్రప్రదేశ్ ను తన ఐదేళ్ల అధ్వాన పాలనతో అస్తవ్యస్థంగా మార్చేసిన జగన్ ఓటమి తరువాత కూడా తన తీరు మార్చుకోలేదు. జనం తిరస్కరించారన్న సోయ కూడా లేకుండా.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని గగ్గోలు పెడుతున్నారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా అనిపించేలా పరిస్థితులు ఉన్నాయన్న సంగతి విస్మరించి.. వ్యక్తిగత ఘర్షణలకు సైతం పొలిటికల్ కలర్ ఇస్తూ హస్తినలో ధర్నా అంటూ హడావుడి చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ను లైట్ తీసుకోవాలంటూ ఆయన పార్టీకే చెందిన మాజీ ఎంపి మార్గాని భరత్ తెలియకుండానే చెప్పేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యలో తన ఓటమికి కారణాలు వివరిస్తూ జగన్ చాతకాని తనాన్ని బయట పెట్టేశారు. జగన్ మద్యం విధానం పార్టీని దారుణంగా దెబ్బతీసిందని అంగీకరించేశారు. ఈ విషయంలో జగన్ తెలివితక్కువగా వ్యవహరించారని మార్గాని భరత్ తన మనసులో మాట చటుక్కున బయటకు చెప్పేశారు.
ఒక టూత్ పేస్ట్ కొనే విషయంలోనే మనకు ఏ బ్రాండ్ కావాలన్నది ఆచితూచి ఎంచుకుంటాం. అటువంటిది మద్యం కొనేవాడు తనకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కోవాలని అనుకోరా అని ప్రశ్నించారు. మేం అమ్మిందే తాగండి అంటే జనం వినరని కూడా భరత్ స్పష్టంగా చెప్పారు. తనకే అర్థమైన ఇంత చిన్న లాజిక్ తమ పార్టీ అధినేత జగన్ కు ఎందుకు అర్ధంకాలేదని పాపం భరత్ ఇప్పుడు బాధ పడుతున్నారు. జగన్ కు మద్యం అలవాటు లేకపోవడం వల్ల ఈ విషయం ఆయనకు తెలియలేదని కవర్ చేసే ప్రయత్నం చేసి భంగపడ్డారు. మద్యం అలవాటు లేకపోతే మాత్రమేం.. రోజూ బ్రష్ చేసుకుంటారు కాదా? అంటూ నెటిజనులు మార్గాని భరత్ కు ఆయన లాజిక్ తోనే ఎదురు సెటైర్లు వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/margani-bharat-says-jagan-noodle-25-181205.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.